Simultaneous Polls Committee : జమిలి ఎన్నికల నిర్వహణ సాధ్యాసాధ్యాలపై మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ నేతృత్వంలో ఏర్పాటైన నిపుణుల కమిటీ.. కార్యాచరణ మొదలు పెట్టింది. ఈ నేపథ్యంలో దేశవ్యాప్తంగా ఒకేసారి ఎన్నికల నిర్వహణపై లా కమిషన్ కమిషన్ సిద్ధం చేసిన ఓ 'రోడ్ మ్యాప్' వచ్చే వారమే కోవింద్ కమిటీకి అందనుంది. అంతకుముందు దేశవ్యాప్తంగా జమిలి ఎన్నికలు ఎలా నిర్వహించవచ్చు అనే విషయంపై తన అభిప్రాయాలను ఈ నెల 25న వెల్లడించాలని లా కమిషన్‌ను రామ్‌నాథ్ కమిటీ ఆహ్వానించింది. ఈ నేపథ్యంలో కోవింద్ కమిటీకి.. జమిలి ఎన్నికల విషయంపై లా కమిషన్ కీలక సిఫార్సులు చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
Jamili Elections In Telugu : ఇటీవల భేటీ అయిన రామ్‌నాథ్ కోవింద్ నేతృత్వంలోని ఉన్నతస్థాయి కమిటీ.. జమిలి ఎన్నికల యోచనపై రాజకీయ పార్టీల అభిప్రాయాలు తెలుసుకోవాలని నిర్ణయించింది. ఇందుకోసం ఏఏ తేదీల్లో తమకు అనుకూలంగా ఉంటుందో అనే విషయాన్ని తెలియజేయాలని సూచించింది. వచ్చే మూడు నెలల్లో తమ అభిప్రాయాలను లిఖితపూర్వకంగా తెలియజేసే అవకాశం కూడా రాజకీయ పార్టీలకు ఇచ్చినట్లు తెలుస్తోంది.
One Nation One Election UPSC : మరోవైపు, జస్టిస్ రితురాజ్ అవస్థి నేతృత్వంలోనే లా కమిషన్.. 2029 నుంచి లోక్‌సభతో పాటు అన్ని రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలను నిర్వహించేలా ఓ ఫార్ములా రూపొందిస్తున్నట్లు విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. వివిధ రాష్ట్రాల శాసనసభల కాల పరిమితిని పెంచడం లేదా తగ్గించడం ద్వారా జమిలి నిర్వహించే సిఫార్సులను సిద్ధం చేస్తున్నట్లు వార్తలు వచ్చాయి.
One Nation One Election Committe : జమిలి ఎన్నికలపై ఏర్పాటైన కమిటీ తొలి సమావేశంలోనే కీలక నిర్ణయాలు తీసుకుంది. గుర్తింపు పొందిన జాతీయ, రాష్ట్ర రాజకీయ పార్టీల అభిప్రాయలను స్వీకరిస్తామని చెప్పింది. దీంతో పాటు లా కమిషన్ సలహాలను సైతం తీసుకుంటామని స్పష్టం చేసింది. కార్యాచరణ ప్రణాళికలు, అధికారిక సంప్రదింపులు ఎలా జరపాలన్న అంశాలపై కమిటీ చర్చించింది. కేంద్రం నిర్దేశించిన పనులకు పేపర్ వర్కు తయారు చేయడం, అవసరమైన విషయాలపై లోతైన పరిశోధనలు చేయడంపై చర్చలు జరిగినట్లు తెలిసింది.
One Nation One Election Committee : జమిలి ఎన్నికలపై కసరత్తు ముమ్మరం.. రామ్‌నాథ్ ఇంట్లో కీలక భేటీ
One Nation One Election : జమిలి ఎన్నికలపై కసరత్తు షురూ.. ప్రజలకు ఒరిగేదేంటని విపక్షాల ప్రశ్న