ETV Bharat / bharat

Simultaneous Elections Law Commission : 2029లో జమిలి ఎన్నికలు.. లా కమిషన్ ప్లాన్ రెడీ.. అసెంబ్లీల కాలవ్యవధిపై ఆ ఫార్ములా! - one nation one election law commission report

Simultaneous Elections Law Commission Report : 2029లో జమిలి ఎన్నికలు నిర్వహించేందుకు వీలుగా లా కమిషన్ కీలక ప్రతిపాదనలు చేసినట్లు తెలుస్తోంది. వివిధ రాష్ట్రాల అసెంబ్లీల కాలవ్యవధిని.. జమిలి ఎన్నికలు జరిగే సమయానికి కుదించడమో, పొడగించడమో చేయాలని సూచించింది. దీంతో పాటు ఓటరు జాబితా రూపొందించడంపైనా కీలక సిఫార్సులు చేసింది.

Simultaneous Elections Law Commission
Simultaneous Elections Law Commission
author img

By PTI

Published : Sep 29, 2023, 4:43 PM IST

Updated : Sep 29, 2023, 5:46 PM IST

Simultaneous Elections Law Commission Report : జమిలి ఎన్నికల నిర్వహణ కోసం కేంద్రం కసరత్తు చేస్తున్న నేపథ్యంలో న్యాయ కమిషన్.. ఇందుకు సంబంధించి ఓ ఫార్ములాను రూపొందించినట్లు తెలుస్తోంది. 2029లో అన్ని అసెంబ్లీలు, లోక్​సభకు ఒకేసారి ఎన్నికలు నిర్వహించేలా కీలక సిఫార్సులు చేసింది. ఈ మేరకు లా కమిషన్ ప్రణాళికలు రచిస్తోందని సంబంధిత వర్గాలు తెలిపాయి. ఒకేసారి ఎన్నికల నిర్వహణకు వీలుగా.. కొన్ని రాష్ట్రాల అసెంబ్లీల కాలవ్యవధిని పొడగించడం, మరికొన్నింటి పరిధిని పెంచడం వంటివి చేపట్టనున్నట్లు వివరించాయి.

ఒకే ఓటరు జాబితా
Jamili Elections News : జమిలి ఎన్నికల కోసం ఓటరు జాబితా కూడా ఒకేసారి రూపొందించేలా ఓ యంత్రాంగాన్ని సిద్ధం చేయాలని లా కమిషన్ ప్రతిపాదిస్తోంది. ప్రస్తుతం అసెంబ్లీ ఎన్నికలకు ఆయా రాష్ట్రాల ఎన్నికల కమిషన్లు ఓటరు జాబితాను తయారు చేస్తున్నాయి. లోక్​సభ ఎన్నికలకు కేంద్ర ఎన్నికల సంఘం జాబితాను సిద్ధం చేస్తోంది. ప్రక్రియ దాదాపుగా ఒకటే అయినా.. రెండుసార్లు చేయాల్సి వస్తున్న నేపథ్యంలో.. లా కమిషన్ దీనిపై పరిష్కారం దిశగా ఆలోచన చేస్తున్నట్లు తెలుస్తోంది.

మూడు శ్రేణుల్లో.. రెండు విడతల్లో జమిలి!
Simultaneous Elections In India : జమిలి ఎన్నికల నిర్వహణపై అధ్యయనం చేయాలని ఇప్పటికే అత్యున్నత స్థాయి కమిటీని కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది. మాజీ రాష్ట్రపతి రామ్​నాథ్ కోవింద్ నేతృత్వంలో ఏర్పాటైన ఈ కమిటీ.. జమిలి ఎన్నికల నిర్వహణలో ఉన్న పరిమితులు, ఇతర అంశాలపై చర్చిస్తోంది. అయితే, లా కమిషన్ మాత్రం.. జమిలి నిర్వహణకు మార్గాల అన్వేషణపైనే ప్రధానంగా దృష్టిసారించినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం జాతీయ, రాష్ట్ర స్థాయుల్లో కొనసాగుతున్న ఎన్నికలే కాకుండా.. తృతీయ శ్రేణి ఎన్నికలు నిర్వహించాలని లా కమిషన్ పేర్కొంది. మూడు విడతల్లో జమిలి ఎన్నికలు జరపాలని సూచించింది. తొలి విడతలో లోక్​సభ, అసెంబ్లీ ఎన్నికలు పూర్తి చేయాలని, రెండో విడతలో స్థానిక సంస్థలకు ఎలక్షన్లు నిర్వహించాలని సిఫార్సు చేసింది.

"ప్రస్తుతం అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలు వేర్వేరు సమయాల్లో జరుగుతున్నాయి. ఓటర్లు ఒకటికంటే ఎక్కువసార్లు పోలింగ్ బూత్​లకు వెళ్లాల్సి వస్తోంది. ఇలా కాకుండా ఒకేసారి ఎన్నికలు జరిగేలా చూడాలని లా కమిషన్ ప్రతిపాదిస్తోంది. ఈ భారీ ప్రజాస్వామ్య ప్రక్రియను సాఫీగా ముగించేలా లా కమిషన్ ప్రతిపాదనలు సిద్ధం చేస్తోంది. లోక్​సభ, అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించడానికి మార్గాలేంటనే విషయాలపై మాత్రమే కమిషన్ సూచనలు చేయనుంది. కోవింద్ నేతృత్వంలోని ఉన్నతస్థాయి కమిటీ.. ఎలా జమిలీ ఎన్నికలు నిర్వహించాలనే విషయంపై నిర్ధరణకు వస్తుంది. స్థానిక సంస్థల ఎన్నికలను సైతం జమిలిలో కలిపే విషయంపై కమిషన్ ఒక సిఫార్సు చేసింది. రెండు విడతల్లో జమిలి నిర్వహించుకోవచ్చని.. తొలి విడతలో అసెంబ్లీలు, లోక్​సభకు; రెండో విడతలో స్థానిక సంస్థలకు దేశవ్యాప్తంగా ఒకేసారి ఎన్నికలు నిర్వహించవచ్చని సూచిస్తోంది. దేశవ్యాప్తంగా భిన్న వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో ఇదే ఆచరణయోగ్యమైన విధానమని కమిషన్ భావిస్తోంది."
-సంబంధిత వర్గాలు

ఈ-ఎఫ్ఐఆర్​లు స్టార్ట్...!
మరోవైపు, ఈ-ఎఫ్ఐఆర్​ల నమోదును విడతలవారీగా ప్రారంభించాలని లా కమిషన్ ప్రతిపాదించింది. మూడేళ్లకన్నా అధిక శిక్ష పడే కేసుల ఎఫ్ఐఆర్​లను మొదట ఆన్​లైన్​ విధానంలో నమోదు చేయనున్నట్లు తెలిపింది. ఇందుకోసం కేంద్రీకృత జాతీయ పోర్టల్​ను ఏర్పాటు చేయాలని ప్రతిపాదించింది. దీని వల్ల ఎఫ్ఐఆర్​ల నమోదులో జాప్యం సమస్యను పరిష్కరించవచ్చని, పౌరులు వెంటనే కేసులను రిపోర్ట్ చేసేందుకు వీలు కల్పించినట్లు అవుతుందని లా కమిషన్ పేర్కొంది.

'సెక్స్ అంగీకార వయసు తగ్గించొద్దు'
శృంగార అంగీకార వయసును 18 నుంచి 16కు తగ్గించాలనే ప్రతిపాదనపై లా కమిషన్ భిన్నస్వరం వినిపించింది. అనుమతి వయసును తగ్గించాల్సిన అవసరం లేదని పేర్కొంది. అలా చేస్తే బాల్యవివాహాలను అరికట్టడంపై ప్రతికూల ప్రభావం పడుతుందని ఆందోళన వ్యక్తం చేసింది. అయితే, 16-18 ఏళ్ల వయసు ఉండి, పరస్పర ఆమోదంతో కలయికలో పాల్గొన్నవారి కేసులను పరిష్కరించేందుకు న్యాయమూర్తులకు మార్గదర్శకాలతో కూడిన విచక్షణాధికారాలు ఇవ్వాలని సిఫార్సు చేసింది.

జమిలి ఎన్నికలపై ఈటీవీ భారత్ ప్రత్యేక కథనాలు:

జమిలి ఎన్నికలు సాధ్యమేనా? విపక్షాలు ఒప్పుకుంటాయా? అసలేంటి లాభం!

ఘనతర గణతంత్రం! జమిలి ఎన్నికలు-సాధ్యాసాధ్యాలు

దేశంలో జమిలి ఎన్నికలు సాధ్యమేనా?

'ఒకే దేశం ఒకే ఎన్నిక' పై భిన్న స్వరాలు

ఘనతర గణతంత్రం! జమిలి ఎన్నికలు-సాధ్యాసాధ్యాలు

'జమిలి ఎన్నికలు భారత్​కు అవసరం'

'జమిలి ఎన్నికల పేరుతో భాజపా కుట్ర'

ఒకే దేశం-ఒకే విధానంతో మోదీ స్వప్నం నెరవేరేనా?

Last Updated : Sep 29, 2023, 5:46 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.