Sikkim Floods Death Toll : సిక్కిం ఆకస్మిక వరదల్లో చనిపోయినవారి సంఖ్య 21కి పెరిగింది. గల్లంతైన 23 మంది సైనికుల్లో ఏడుగురి మృతదేహాలు వేర్వేరు లోతట్టు ప్రాంతాల్లో లభ్యమైనట్లు రక్షణ శాఖ అధికారులు తెలిపారు. ఒకరిని సురక్షితంగా రక్షించినట్లు పేర్కొన్నారు. మిగతా 15మంది సైనికులు సహా 118 కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నట్లు చెప్పారు.
-
Sikkim flash floods | Search for the missing Indian Army personnel continues. Meanwhile, Indian Army is providing assistance in terms of food, medical aid and extending communication facilities to civilians and tourists stranded in North Sikkim: PRO Defence, Guwahati pic.twitter.com/NYCZQ5H7A0
— ANI (@ANI) October 6, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
">Sikkim flash floods | Search for the missing Indian Army personnel continues. Meanwhile, Indian Army is providing assistance in terms of food, medical aid and extending communication facilities to civilians and tourists stranded in North Sikkim: PRO Defence, Guwahati pic.twitter.com/NYCZQ5H7A0
— ANI (@ANI) October 6, 2023Sikkim flash floods | Search for the missing Indian Army personnel continues. Meanwhile, Indian Army is providing assistance in terms of food, medical aid and extending communication facilities to civilians and tourists stranded in North Sikkim: PRO Defence, Guwahati pic.twitter.com/NYCZQ5H7A0
— ANI (@ANI) October 6, 2023
'పర్యటకులను రక్షించిన సైన్యం'
Sikkim Cloud Burst : లాచెన్, లాచింగ్, చుంగ్తాంగ్ ప్రాంతాల్లో చిక్కుకుపోయిన 1,471 మంది పర్యటకులను సైన్యం రక్షించిందని పేర్కొంది. శుక్రవారం వాతావరణం మెరుగుపడడం వల్ల.. వరదల్లో చిక్కుకుపోయిన పర్యటకులను హెలికాప్టర్ల ద్వారా తరలించే అవకాశం ఉందని వెల్లడించింది. అలాగే ఉత్తర సిక్కింలో చిక్కుకుపోయిన పౌరులు, పర్యటకులకు ఆహారం, వైద్య సాయాన్ని భారత సైన్యం అందిస్తోందని పేర్కొంది.
-
#WATCH | Sikkim flash floods | Search for the missing Indian Army personnel continues. Meanwhile, Indian Army is providing assistance in terms of food, medical aid and extending communication facilities to civilians and tourists stranded in North Sikkim: PRO Defence, Guwahati… https://t.co/ackHKFuVGU pic.twitter.com/6zspsZzCW6
— ANI (@ANI) October 6, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
">#WATCH | Sikkim flash floods | Search for the missing Indian Army personnel continues. Meanwhile, Indian Army is providing assistance in terms of food, medical aid and extending communication facilities to civilians and tourists stranded in North Sikkim: PRO Defence, Guwahati… https://t.co/ackHKFuVGU pic.twitter.com/6zspsZzCW6
— ANI (@ANI) October 6, 2023#WATCH | Sikkim flash floods | Search for the missing Indian Army personnel continues. Meanwhile, Indian Army is providing assistance in terms of food, medical aid and extending communication facilities to civilians and tourists stranded in North Sikkim: PRO Defence, Guwahati… https://t.co/ackHKFuVGU pic.twitter.com/6zspsZzCW6
— ANI (@ANI) October 6, 2023
'13 వంతెనలు ధ్వంసం'
Flood In Sikkim 2023 : అలాగే వరదల కారణంగా సిక్కింలోని 13 వంతెనలు ధ్వంసమయ్యాయి. ఒక్క మంగన్ జిల్లాలోనే ఎనిమిది వంతెనలు కొట్టుకుపోగా.. గ్యాంగ్‌టక్‌లో మూడు, నామ్‌చీలో రెండు వంతెనలు ధ్వంసమయ్యాయి. చుంగ్తాంగ్ పట్టణం వరదల ఉద్ధృతికి తీవ్రంగా దెబ్బతింది. ఆ పట్టణంలో పలు చోట్ల కరెంట్ లేదు. అలాగే రాష్ట్ర జీవనాడిగా భావించే జాతీయ రహదారి NH-10 కూడా తీవ్రంగా దెబ్బతింది. ఇప్పటివరకు 2,411 మందిని పునరావాస కేంద్రాలకు తరలించామని సిక్కిం విపత్తు నిర్వహణ సంస్థ తెలిపింది. దాదాపు 22 వేల మందిపై వరదలు ప్రభావం చూపాయని పేర్కొంది.
గాలింపు చర్యలు ముమ్మరం..
మంగళవారం రాత్రి కురిసిన కుండపోత వర్షానికి ఉత్తర సిక్కింలోని లోనాక్ సరస్సు ప్రాంతంలో వరదలు పోటెత్తాయి. చుంగ్‌తాంగ్ డ్యాంలోకి వరద ప్రవాహం పెరగటం వల్ల నీటిని విడుదల చేశారు. దీంతో తీస్తానది పరివాహక ప్రాంతాలను వరదలు ముంచెత్తాయి. సైనిక శిబిరాలు, వాహనాలు కొట్టుకుపోయాయి. వందలాది మంది గల్లంతయ్యారు. పాక్యోంగ్‌లో 59 మంది, గ్యాంగ్‌టక్‌లో 22, మంగన్‌లో 17, నామ్‌చీలో ఐదుగురు గల్లంతయ్యారు. సైన్యం, NDRF బృందాలు గల్లంతైన వారి కోసం 4వ రోజు గాలింపు చర్యలు కొనసాగిస్తున్నాయి.
Sikkim Flood 2023 : వరదలతో సిక్కిం అతలాకుతలం.. స్తంభించిన జనజీవనం.. జలదిగ్భందంలో వేలాది మంది!