ETV Bharat / bharat

'మోదీ కాన్వాయ్ ఆపింది మేమే'.. సిక్కు వేర్పాటువాదుల ప్రకటన! - పంజాబ్ మోదీ కాన్వాయ్ అడ్డగింత సిక్కు వేర్పాటువాదులు

Sikhs for Justice threatening calls: పంజాబ్​లో ప్రధాని కాన్వాయ్ 20 నిమిషాల పాటు నిలిచిపోవడానికి కారణం తామేనంటూ సిక్కు వేర్పాటువాద సంస్థ 'సిక్స్ ఫర్ జస్టిస్' ప్రకటించుకుంది. ఈ వ్యవహారంపై సుప్రీంకోర్టులో విచారణ జరపొద్దంటూ బెదిరింపులకు పాల్పడింది. ఈ విషయాన్ని సుప్రీంకోర్టు న్యాయవాదుల సంఘం అత్యున్నత ధర్మాసనం దృష్టికి తీసుకొచ్చింది.

Sikh for Justice threatening calls
Sikh for Justice threatening calls
author img

By

Published : Jan 10, 2022, 7:25 PM IST

Sikhs for Justice threatening calls: పంజాబ్​లో ప్రధాని పర్యటనలో భద్రతా వైఫల్యాలపై జరుగుతున్న దర్యాప్తును నిలిపివేయాలంటూ బెదిరింపు సందేశాలు వచ్చాయని సుప్రీంకోర్టు న్యాయవాదుల సంఘం సోమవారం పేర్కొంది. అమెరికా కేంద్రంగా పనిచేసే ఖలిస్థానీ అనుకూల వేర్పాటువాద సంస్థ 'సిక్స్ ఫర్ జస్టిస్'(ఎస్ఎఫ్​జే) నుంచి ఫోన్ కాల్స్ వచ్చాయని అత్యున్నత ధర్మాసనానికి నివేదించింది. మోదీ కాన్వాయ్​ను అడ్డగించింది తామేనని ఎస్ఎఫ్​జే పేర్కొందని తెలిపింది. ఈ ఘటనపై ఎన్​జీఓ దాఖలు చేసిన ప్రజా ప్రయోజన వ్యాజ్యంపై విచారణ జరపొద్దని న్యాయమూర్తులనూ బెదిరించారని వివరించింది.

Punjab Modi security breach:

Sikh for Justice Modi security breach

"'అడ్వకేట్స్ ఆన్ రికార్డ్ ఆఫ్ సుప్రీంకోర్టు' సభ్యులకు గుర్తు తెలియని వ్యక్తుల నుంచి ముందస్తుగా రికార్డు చేసిన బెదిరింపు కాల్స్ వచ్చాయి. జనవరి 10న ఉదయం 10.40 గంటలకు, మధ్యాహ్నం 12.36 గంటలకు ఈ కాల్స్ చేశారు. హుస్సానిన్​వాలా ఫ్లైఓవర్​పై మోదీ కాన్వాయ్​ను అడ్డుకోవడం వెనక తమ హస్తం ఉందని పేర్కొన్నారు. 1984 సిక్కు వ్యతిరేక అల్లర్లలో దోషులను శిక్షించడంలో సుప్రీంకోర్టు విఫలమైందని, వేల మంది సిక్కు రైతులు చనిపోయినా ఎవరూ నోరు మెదపలేదని అన్నారు. అలాంటి న్యాయస్థానం దీనిపై విచారణ చేపట్టొద్దని ఫోన్​కాల్​లో హెచ్చరించారు."

-సుప్రీంకోర్టు న్యాయవాదుల సంఘం లేఖ

ఈ వ్యవహారంపై వెంటనే చర్యలు తీసుకోవాలని సుప్రీంకోర్టు న్యాయవాదుల సంఘం కోరింది. అడ్వకేట్ల గోప్యతకు భంగం కలిగిస్తూ మొబైల్ నంబర్లను ప్రజాబాహుళ్యంలో ఉంచడంపై ఆందోళన వ్యక్తం చేసింది. సుప్రీంకోర్టు కేసు వివరాలు, బ్యాంకు ఖాతాల సమాచారాన్ని అడ్వకేట్లు తమ ఫోన్లలో నిక్షిప్తం చేస్తారని, హ్యాకింగ్ జరిగితే ఇవన్నీ దుర్వినియోగమవుతాయని పేర్కొంది.

ఇదీ చదవండి: ప్రధాని పర్యటనలో భద్రతా లోపంపై విచారణకు స్వతంత్ర కమిటీ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.