ETV Bharat / bharat

అయ్యప్ప ఆలయంలో 18 మెట్లు మాత్రమే ఎందుకుంటాయి? ఒక్కో మెట్టు విశిష్టత ఏంటి? - శబరిమలలో ఉన్న 18 మెట్ల ప్రాముఖ్యత‌

Significance of Ayyappa Swamy 18 Steps : శబరిమల అయ్యప్ప ఆలయం అనగానే 18 మెట్లు గుర్తొస్తాయి. స్వామి వారిని దర్శించుకోవాలంటే.. కచ్చితంగా ఈ 18 మెట్లు ఎక్కాల్సిందే. అది కూడా 41 రోజుల పాటు దీక్ష చేసి.. తలపై ఇరుముడి పెట్టుకుని ఈ మెట్లు ఎక్కితేనే ఆ అయ్యన్ అయ్యప్ప స్వామి దర్శనభాగ్యం కలుగుతుంది. అయితే అయ్యప్ప స్వామి ఆలయంలో 18 మెట్లు ఎందుకు ఉన్నాయి ? ఈ 18కి అయ్యప్ప స్వామికి ఉన్న సంబంధమేంటి ? 18 మెట్లనే ఆ అయ్యప్ప స్వామి ఎందుకు ఎంచుకున్నారు..? వాటి విశిష్టత..? ఇప్పుడు తెలుసుకుందాం...

Ayyappa Swamy
Ayyappa Swamy
author img

By ETV Bharat Telugu Team

Published : Dec 7, 2023, 10:16 AM IST

Ayyappa Swamy 18 Steps Significance in Telugu : కార్తీక మాసం ప్రారంభంతోనే లక్షలాదిమంది భక్తులు హరిహర సుతుడు అయ్యప్పస్వామి దీక్షలను ప్రారంభిస్తారు. తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా దక్షిణ భారతదేశం మొత్తం నవంబర్, డిసెంబర్, జనవరి ఈ మూడు నెలలు ఎక్కడ చూసిన అయ్యప్ప భక్తులే కనిపిస్తారు. కఠిన నియమ, నిష్ఠ‌ల‌తో 41 రోజుల పాటు మండల దీక్ష చేపడతారు. "స్వామియే శరణం అయ్యప్ప" అంటూ కోరిన కోర్కెలు తీర్చాలని, కష్టాల నుంచి గట్టెక్కించాలిని ధృడసంకల్పంతో మణికంఠుని(Ayyappa Swamy) దీక్ష చేస్తారు.

Sabarimala Ayyappa Swamy 18 Steps : ఇక పోతే స్వామి ఆలయం ముందున్న 18 మెట్లను ‘పదునెట్టాంబడి’ అంటారు. ఈ సోపానాలు అధిరోహించడానికి ప్రతి భక్తుడు 41 రోజులు మండల దీక్ష తీసుకుని ఇరుముడి తలపై పెట్టుకుని ఆ మెట్లు ఎక్కుతారు. ఒక్కో మెట్టుకు ఒక్కో అధిష్ఠాన దేవత ఉంటుందని భక్తుల నమ్మకం. అయితే చాలా మందికి వచ్చే సందేహం ఏంటంటే.. ఎందుకని సరిగ్గా ఆ సంఖ్యలోనే స్వామి వారి మెట్లు ఉంటాయి. అందుకు గల కారణాలేంటి? ఒక్కో మెట్టుకు ఉన్న విశిష్టత ఏంటి? అని.ఆ వివరాలు ఈ స్టోరీలో తెలుసుకుందాం..

18 మెట్లు ఎందుకంటే... మణికంఠుడు...అయ్యప్ప స్వామిగా శబరిగిరిలో కొలువైయ్యేందుకు 4వేదాలు, 2శాస్త్రాలు, అష్టదిక్పాలకులు, విద్య, అవిద్య, జ్ఞానం, అజ్ఞానం అనే దేవతా రూపాలు 18 మెట్లుగా మారడంతో ఒక్కో మెట్టుపై అడుగేస్తూ ఉన్నత స్థానాన్ని అధిష్ఠించారని చెబుతారు. పట్టబంధాసనంలో కూర్చుని చిన్ముద్ర, అభయహస్తాలతో దర్శనమిచ్చి యోగసమాధిలోకి వెళ్లిన స్వామి.. జ్యోతి రూపంగా అంతర్ధానమయ్యారని పురాణాలు చెబుతున్నాయి.

18 మెట్ల అష్టాదశ దేవతలెవరంటే.. 1) మహంకాళి, 2) కళింకాళి, 3) భైరవ, 4) సుబ్రహ్మణ్యం, 5) గంధర్వరాజ, 6) కార్తవీర్య, 7) క్రిష్ణ పింగళ, 8) భేతాళ, 9) మహిషాసుర మర్దని, 10) నాగరాజ, 11) రేణుకా పరమేశ్వరి, 12) హిడింబ, 13) కర్ణ వైశాఖ, 14) అన్నపూర్ణేశ్వరి, 15) పుళిందిని, 16) స్వప్న వారాహి, 17) ప్రత్యంగళి, 18) నాగ యక్షిణి..

శబరిమల వెళ్లే అయ్యప్ప మాలధారులు - ఈ జాగ్రత్తలు తీసుకోవాలి!

18 మెట్ల పేర్లు: అయ్యప్ప సన్నిధానంలో సోపానాలను పంచలోహాలతో (స్వర్ణం, వెండి, రాగి, ఇత్తడి, కంచు) నిర్మించారు. 18 మెట్లలో ఒక్కో మెట్టుకు ఒక్కో పేరు ఉంది. అవేంటంటే… 1. అణిమ 2. లఘిమ 3. మహిమ 4. ఈశ్వత 5. వశ్యత 6. ప్రాకామ్య 7. బుద్ధి 8. ఇచ్ఛ 9. ప్రాప్తి 10. సర్వకామ 11. సర్వ సంపత్కర 12. సర్వ ప్రియకర 13. సర్వమంగళాకార 14.సర్వ దుఃఖ విమోచన 15. సర్వ మృత్యుప్రశమన 16. సర్వ విఘ్ననివారణ 17.సర్వాంగ సుందర 18.సర్వ సౌభాగ్యదాయక..

18 మెట్లకు ఉన్న విశిష్టతలిలా..

  • అయ్యప్ప సన్నిధానంలోని తొలి ఐదు మెట్లు మనిషి పంచేంద్రియాలతో సమానం. కళ్లు, చెవులు, నాలుక, ముక్కు, స్పర్శలకు ప్రతీకలుగా ఇవి నిలుస్తాయి. మనుషుల చూపు ఎప్పుడు మంచివాటిపైనే ఉండాలని.. మంచి వినాలి, మంచి మాట్లాడాలి, తాజా శ్వాస పీల్చుకోవాలని సూచిస్తుంది.
  • ఆ తర్వాత ఎనిమిది మెట్లు రాగద్వేషాలకు సంకేతంగా పరిగణిస్తారు. అంటే కామం, క్రోదం, మోహం, లోభం, మదం, మాస్తర్యం, అసూయ, డాంబికాలు వదిలి మంచి మార్గంలో పయనించాలని సూచిస్తాయి.
  • తర్వాత మూడు మెట్లు త్రిగుణాలకు సంబంధించినవిగా చెబుతారు. సత్వ, తమో, రజో గుణాలకు ఈ మూడు మెట్లు ప్రతీకగా నిలుస్తాయి.
  • చివరి రెండు మెట్లు విద్య- అవిద్యను సూచిస్తాయి. విద్య అంటే జ్ఞానం. అంతా జ్ఞానం పొందేందుకు అవిద్య అనే అహంకారాన్ని వదిలిపెట్టాలని సంకేతం.
  • ఇంకో విషయం మాలధారులు.. మెట్లు ఎక్కేటప్పుడు, దిగేటప్పుడు కూడా స్వామి వారిని చూస్తూ కిందకు దిగుతారు.

How to Book Sabarimala Online Darshan Tickets 2023 : శబరిమల దర్శనం టికెట్లు ఆన్​లైన్లో.. ఇలా బుక్ చేసుకోండి..!

శబరిమల అయ్యప్ప భక్తులకు గుడ్​న్యూస్​- వారి కోసం 'అయ్యన్​' యాప్​, ఇక మరింత ఈజీగా దర్శనం!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.