Sickle Stuck in Head Of Teenager: మధ్యప్రదేశ్ సాగర్ జిల్లాలో ఒళ్లు గగుర్పొడిచే ఘటన జరిగింది. ప్రమాదవశాత్తు ఓ బాలుడి తలలో కొడవలి గుచ్చుకుంది.
జిల్లాలోని సునా పాంజ్రా గ్రామంలో బుధవారం రాత్రి కిషోర్(16) మంచంపై నిద్రపోయాడు. అర్ధరాత్రి సమయంలో నిద్రలేచి మంచంపైనుంచి కిందకు అడుగులు వేశాడు. ఈ క్రమంలో కిందపడ్డాడు కిషోర్. అప్పటికే అక్కడ నిటారుగా ఉన్న కొడవలి ప్రమాదవశాత్తు కిషోర్ తలలో గుచ్చుకుంది. బంధువులు అతడ్ని దగ్గరిలోని డియోరి ఆస్పత్రికి తరలించగా.. వారు జిల్లా కేంద్రానికి సిఫార్సు చేశారు.
సాగర్ జిల్లా ఆస్పత్రిలో శస్త్రచికిత్స చేసిన వైద్యులు.. కొడవలిని కిషోర్ తల నుంచి తొలగించారు. కొడవలి తలలోకి రెండు అంగుళాల లోతుగా చొచ్చుకుపోయిందని వైద్యులు తెలిపారు. అయినప్పటికీ బాధితునికి ఏ మాత్రం నొప్పి, రక్తస్రావం లేకపోవడం ఆశ్చర్యం కలిగించిందని చెప్పారు.
ఇదీ చదవండి: ఆ విద్యార్థుల భవిష్యత్తు అగమ్యగోచరం.. చైనాకు తిరిగి వెళ్లేదెప్పుడు?