ETV Bharat / bharat

Sick Child Dead In Train : కిడ్నీ సమస్యతో 3ఏళ్ల చిన్నారి మృతి.. దిల్లీకి రైలులో తరలిస్తుండగా.. - shajahanpur railway station child kidnapping case

Sick Child Dead In Train : కిడ్నీ సమస్యతో బాధపడుతున్న చిన్నారిని మెరుగైన వైద్యం కోసం దిల్లీలోని ఆస్పత్రికి రైలులో తరలిస్తుండగా మృతి చెందాడు. వైద్య సిబ్బంది సరైన సమయంలో ఆక్సిజన్​ను అందించకపోవడం వల్లే తమ కుమారుడు చనిపోయాడని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. మరోవైపు ఉత్తర్​ప్రదేశ్​లో తల్లితో కలిసి రైల్వేస్టేషన్​లో నిద్రిస్తున్న చిన్నారిని ఎత్తుకెళ్లే ప్రయత్నం చేశాడు ఓ యువకుడు. పరుగెత్తుతున్న యువకుడిని స్థానికులు వెంబడించారు. దీంతో చిన్నారిని కింద పడిపోయి.. మృతి చెందింది.

Sick Child Dead In Train
Sick Child Dead In Train
author img

By ETV Bharat Telugu Team

Published : Aug 31, 2023, 4:13 PM IST

Updated : Aug 31, 2023, 5:35 PM IST

Sick Child Dead In Train : అనారోగ్యంతో బాధపడుతున్న చిన్నారిని ఆస్పత్రికి రైలులో తరలిస్తుండగా మృతి చెందిన ఘటన ఉత్తరప్రదేశ్​లోని ఫిరోజాబాద్​లో జరిగింది. చిన్నారికి వైద్య సిబ్బంది సరైన సమయంలో ఆక్సిజన్​ను అందించకపోవడం వల్లే తమ కొడుకు చనిపోయాడని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు.

చిన్నారికి కిడ్నీ సమస్య..
ఝార్ఖండ్​లోని గిరిదీ జిల్లా నీమదీ గ్రామంలో భార్యాభర్తలు పవన్​ కుమార్​, నీలుదేవిలు నివాసం ఉంటున్నారు. వీరి కుమారుడు కృష్ణ కార్తికేయ(3) గత కొంతకాలంగా కిడ్నీ సమస్యతో బాధపడుతున్నాడు. కృష్ణ కార్తికేయకు కొన్ని రోజుల నుంచి పట్నాలో చికిత్స అందిస్తున్నారు. చిన్నారి పరిస్థితి విషమం కావడం వల్ల వైద్యులు దిల్లీకి వెళ్లాలని తెలిపారు. దీంతో వారు బిహార్​ నుంచి తేజస్​ ఎక్స్​ప్రెస్​లో దిల్లీకి చిన్నారిని తీసుకువెళ్తున్నారు. దిల్లీకి చేరేలోపే చిన్నారి పరిస్థితి మరింత విషమించింది. దీంతో రైలును ఉత్తర్​ప్రదేశ్​లోని ఫిరోజాబాద్,​ టూండ్లా రైల్వేస్టేషన్​లో ఆపారు. చిన్నారి అప్పటికే మృతి చెందాడు.

వైద్యులు సరైన సమయంలో తమ చిన్నారికి ఆక్సిజన్​ను అందించలేదని తల్లిదండ్రులు ఆరోపించారు. శవపరీక్షల​ కోసం చిన్నారి మృతదేహాన్ని పోలీసులు ఆస్పత్రికి తరలించారు. ఆక్సిజన్​, వెంటిలేటర్​ పరికరాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

తల్లితో ఉన్న చిన్నారిని..
ఉత్తర్​ప్రదేశ్​లోని షాజహాన్​పుర్​ రైల్వే స్టేషన్​లో దారుణం జరిగింది. రైల్వేస్టేషన్​లో పడుకున్న తల్లి నుంచి బిడ్డను కిడ్నాప్​ చేసి పరుగెత్తాడు ఓ యువకుడు. ఇది గమనించిన తల్లి అరవడం వల్ల స్థానికులు అతడిని పట్టుకోవడానికి ప్రయత్నం చేశారు. అతడు చిన్నారి కింద పడేశాడు. తలకు బలమైన గాయాలు కావడం వల్ల చిన్నారి మృతి చెందింది.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..
హర్దోయ్​ పట్టణానికి చెందిన వైశాలి అనే మహిళ తన కుమార్తెతో కలిసి రైల్వే స్టేషన్​లో నిద్రిస్తోంది. వైశాలి పడుకోవడం గమనించిన అశోక్​ అనే యువకుడు బుధవారం అర్ధరాత్రి 2 గంటలకు చిన్నారిని ఎత్తుకెళ్లి పరుగెత్తుతున్నాడు. ఇది గమనించిన తల్లి అరవడం వల్ల చుట్టుపక్కల ఉన్నవారు యువకుడిని పట్టుకునే ప్రయత్నం చేశారు. దీంతో అతడు బాలికను కింద పడేశాడు. కింద పడ్డ బాలికను స్థానికులు, ఆస్పత్రికి తరలించారు. తలకు బలమైన గాయాలు కావడం వల్ల బాలిక చనిపోయిందని వైద్యులు తెలిపారు. తరువాత నిందితుడు అశోక్​ను రైల్వే పోలీసులు అరెస్టు చేశారు. గత రెండు రోజులుగా వైశాలి, బిడ్డతో రైల్వే స్టేషన్​లోనే ఉందని రైల్వే పోలీసులు చెప్పారు. వైశాలి భర్త జైలులో శిక్షను అనుభవిస్తున్నాడని, ఆమె చిన్నారితో కలిసి జీవిస్తోందని పోలీసులు తెలిపారు.

Man Shot minor girl : పెళ్లికి నిరాకరించిందని కోపం.. 13 ఏళ్ల బాలికను గన్​తో కాల్చి హత్య

Brother Murder : సోదరిపై వేధింపులు.. అడ్డుచెప్పిన సోదరుడి హత్య.. రాఖీకి 2రోజుల ముందే

Last Updated : Aug 31, 2023, 5:35 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.