Shri Ram Pillar Ayodhya : ఉత్తర్‌ప్రదేశ్‌లోని అయోధ్యలో శరవేగంగా రామాలయ నిర్మాణ పనులు జరుగుతున్నాయి. వచ్చే ఏడాది జనవరిలో రామ్ లల్లా విగ్రహ ప్రాణ ప్రతిష్ఠకు ఆలయ నిర్మాణ కమిటీ ఏర్పాట్లు చేస్తోంది. ఈ క్రమంలో అయోధ్యకు 1200 కి.మీ దూరంలో ఉన్న రాజస్థాన్‌లోని మౌంటు అబూ నుంచి శ్రీరాముని స్తూపం సోమవారం రామనగరికి చేరుకుంది. ఈ స్తూపానికి వేద మంత్రోచ్ఛరణల మధ్య పూజలు నిర్వహించారు అశోక్ సింఘాల్ ఫౌండేషన్ సభ్యులు. మంచి ముహుర్తంలో అయోధ్యలోని మణి పర్వత ప్రాంతంలో ఈ స్తూపాన్ని ప్రతిష్ఠిస్తామని తెలిపారు.
290 ప్రదేశాల్లో శ్రీరాముని స్తూపాలు
దేశవ్యాప్తంగా శ్రీరాముడు నడయాడిన 290 ప్రదేశాల్లో శ్రీరాముని స్తూపాలు ఏర్పాటు చేయనుంది అశోక్ సింఘాల్ ఫౌండేషన్. ఈ కార్యక్రమంలో ఎమ్2కే ఫౌండేషన్ కూడా భాగమవ్వనుంది. రాముడు వనవాసం సమయంలో అయోధ్య నుంచి రామేశ్వరం వరకు ప్రయాణించిన 290 ప్రదేశాల్లో ఈ స్తూపాలను ఏర్పాటు చేయనుంది.
"రాజస్థాన్‌లోని మౌంట్ అబూ నుంచి తీసుకొచ్చిన శ్రీరామ స్తూపం ఇసుకరాయితో తయారైంది. వర్షం, దుమ్ము, నాచు ప్రభావం ఈ స్తూపంపై ఉండదు. శ్రీరాముని స్తూపం పొడవు 15 అడుగులు. పొడవు రెండున్నర అడుగులు. ఇప్పటివరకు ఒక్క శ్రీరాముని స్తూపం మాత్రమే వచ్చింది. మిగతావి త్వరలో వస్తాయి. ఈ స్తూపం దాదాపు వెయ్యేళ్లు చెక్కు చెదరకుండా ఉంటుందని భావిస్తున్నాం. మణిపర్వతంపై ఈ శ్రీరాముని స్తూపాన్ని ఏర్పాటు చేస్తాం. నిర్మాణం, ఇతర ఖర్చులన్నీ అశోక్ సింఘాల్ ఫౌండేషన్, ఎమ్2కే ఫౌండేషన్‌లు సంయుక్తంగా భరిస్తాయి. మొట్టమొదట శ్రీరాముడు మణిపర్వతం మీద ఉన్నాడు. అందుకే రాముని స్తూపాన్ని అక్కడే ప్రతిష్ఠిస్తున్నాం. ఆ తర్వాత గుప్తర్ ఘాట్, తంసా నది ఒడ్డున, సూర్యకుండ్ వద్ద ప్రతిష్ఠిస్తాం."
--మనోజ్ తివారీ, అశోక్ సింఘాల్ ఫౌండేషన్ సభ్యుడు
Ayodhya Ram Mandir Opening Date : ఉత్తర్‌ప్రదేశ్‌లోని అయోధ్యలో నిర్మిస్తున్న రామమందిరంలో గ్రౌండ్ ఫ్లోర్ పనులు... డిసెంబరు చివరి కల్లా పూర్తవుతాయని ఆలయ నిర్మాణ కమిటీ ఛైర్‌పర్సన్ నృపేంద్ర మిశ్రా కొద్దిరోజుల క్రితం వెల్లడించారు. వచ్చే ఏడాది జనవరి 20 నుంచి 24 తేదీల మధ్య రామ్‌లల్లా విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ జరిగే అవకాశం ఉందని ప్రకటించారు. ఈ కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోదీ హాజరవుతారని చెప్పారు. ఈ పూర్తి వార్త కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి.
290 Stone Pillars In India : 'జగదానందకారక జయ జానకీ ప్రాణనాయక!'.. దేశంలో 290 చోట్ల 'శ్రీరామ' స్తంభాలు