భారత్లోని పలు రాష్ట్రాల్లో వేగంగా వ్యాపిస్తోన్న బర్డ్ ఫ్లూ వ్యాధి వెనుక ఎవరి హస్తం ఉందో భాజపా తెలపాలని శివసేన మరోసారి విరుచుకుపడింది. వ్యాధి వెనుక పాకిస్థానీ, ఖలిస్థానీ, చైనీయులు, నక్సలైట్లు.. ఎవరైనా ఉన్నారా? చెప్పాలంటూ.. తన అధికార పత్రిక 'సామ్నా'లో ఓ కథనం ప్రచురించింది.
రైతు ఉద్యమం వెనుక పాకిస్థానీ, ఖలిస్థానీ శక్తులు ఉన్నాయంటూ ఇటీవల భాజపా నేతలు తీవ్ర ఆరోపణలు చేసిన నేపథ్యంలో శివసేన ఈ వ్యాఖ్యలు చేసింది. బర్డ్ ఫ్లూ వ్యాధితో పౌల్ట్రీ రంగంలోని రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని శివసేన..తన పేర్కొంది. కేంద్రం తీసుకొచ్చిన రైతు చట్టాల్లో పౌల్ట్రీ రంగం ప్రస్తావనే లేదని విమర్శించింది.
ఇదీ చదవండి : అన్నదాతల బూట్లు తుడిచి సంఘీభావం