కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ అంటే కేంద్రానికి భయమని ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసింది శివసేన. "మోదీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడుతోన్న యోధుడు రాహల్" అని ప్రశంసించింది.
రాహుల్ గాంధీ తిరిగి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు అయితే... అది చాలా మంచి విషయమని శివసేన పార్టీ పత్రిక సామ్నాలో పేర్కొంది. "రాహుల్ గాంధీకి అధికార పార్టీ భయపడుతోంది. గాంధీ కుటుంబాన్ని కించపరిచేందుకు ర్యాలీలు చేయడమే ఇందుకు నిదర్శనం. ఒక్కరు వ్యతిరేకత చూపినా పాలకుడికి భయం మొదలవుతుంది. రాహుల్ విమర్శల నేపథ్యంలో ప్రస్తుతం ఇదే జరుగుతోంది" అని సామ్నా పత్రికలో పేర్కొంది శివసేన.
రాహుల్ బలవంతుడు కాకపోయినా ప్రభుత్వాన్ని నిలదీసేందుకు తనకు వచ్చే ప్రతి అవకాశాన్నీ వినియోగించుకుంటున్నారని శివసేన తెలిపింది. కాంగ్రెస్ను బలోపేతం చేసి కేంద్రానికి దీటైన ప్రతిపక్ష కూటమిగా నిలవాలని శివసేన ఎంపీ సంజయ్ రౌత్ ఇటీవలే చేసిన వ్యాఖ్యలకు మద్దతుగా ఆ పార్టీ ఈ వ్యాఖ్యలు చేసింది.
ఇదీ చదవండి:'యూకే విమానాలను అప్పటివరకు ఆపాల్సిందే'