షిర్డీలోని సాయి బాబా ఆలయానికి మరింత భద్రత కల్పించేందుకు.. సాయి సంస్థాన్, మహారాష్ట్ర పోలీసులు నిర్ణయించారు. అందులో భాగంగా ఆలయనికి సీఐఎస్ఎఫ్ భద్రత ఏర్పాటు చేయడంపై కసరత్తు చేస్తున్నారు. అయితే, ఈ నిర్ణయాన్ని షర్డీ గ్రామస్థులు వ్యతిరేకిస్తున్నారు. తమ డిమాండ్లు నెరవేర్చకుంటే.. మే 1 నుంచి నిరవధికంగా బంద్ చేపడతామని హెచ్చరించారు.
ఇదీ వివాదం..
అంతకుముందు.. ఉగ్రవాదుల నుంచి ముప్పు ఉన్న కారణంగా షిర్డీలోని సాయి మందిరానికి భద్రత రెట్టింపు చేశారు. ప్రస్తుతం సాయిబాబా ఆలయ భద్రతా ఏర్పాట్లను.. సాయి సంస్థాన్ సిబ్బంది నిర్వహిస్తోంది. ఆలయ ప్రాంగణ భద్రతను మహారాష్ట్ర పోలీసుల చూసుకుంటున్నారు. ఇందులో భాగంగా.. ఆలయాన్ని ప్రతిరోజు బాంబు స్క్వాడ్ తనిఖీ చేస్తుంది. అయితే, ఈ భద్రతా వ్యవస్థకు బదులు.. సీఐఎస్ఎఫ్ భద్రత కల్పించాలన్న చర్చ మొదలైంది. దీని కోసం సామాజిక కార్యకర్త సంజయ్ కాలే.. 2018లో బాంబే హైకోర్టులోని ఔరంగాబాద్ బెంచ్‌లో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై విచారణ జరిపిన బెంచ్.. సాయి సంస్థాన్ అభిప్రాయాన్ని కోరింది. అయితే, సీఐఎస్ఎఫ్ భద్రతకు సాయి సంస్థాన్ కూడా మద్దతు పలికింది.
ఈ నిర్ణయాన్ని షిర్డీ గ్రామస్థులు వ్యతిరేకించారు. అనంతరం కోర్టును ఆశ్రయించారు. అందుకు అవసరమైన నిధులు వసూలు చేయడానికి.. రెండు రోజుల క్రితం భిక్షా ఝళి కూడా నిర్వహించారు.
గురువారం షిర్డీలో అఖిలపక్ష నాయకులు, గ్రామస్థుల సమావేశం జరిగింది. మహారాష్ట్ర దినోత్సవమైన మే 1 నుంచి సమ్మె చేసేందుకు నిర్ణయించారు. ఆ తర్వాత కార్యాచరణ కూడా గ్రామ సభ నిర్వహించి ఆరోజే తెలియజేస్తామని గ్రామస్థుడు నితిన్ కోటే తెలిపారు. దీంతో పాటు నాలుగు ప్రధాన డిమాండ్లు వినిపించారు.
షిర్డీలో బంద్ ప్రభావం ఇలా..
- భక్తుల కోసం సాయిబాబా ఆలయం తెరిచి ఉంటుంది.
- సాయిబాబా సంస్థాన్‌లో భక్తులందరూ బస చేయొచ్చు.
- సాయిబాబా ప్రసాదాలయం, క్యాంటీన్ కొనసాగుతాయి.
- భక్తుల కోసం సాయిబాబా సంస్థాన్‌లోని అన్ని సౌకర్యాలు కొనసాగుతాయి.
- సాయిబాబా దర్శనం కోసం వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా గ్రామస్థులు.. అతిథి గృహం, వసతి సదుపాయాలు కల్పిస్తారు.
- ఇతర అన్ని వ్యాపారాలు పూర్తిగా మూసివేస్తారు.
షిర్డీ గ్రామస్థుల డిమాండ్లు ఏమిటి?
- సాయిబాబా మందిరానికి సీఐఎస్ఎఫ్ భద్రత వద్దు.
- సాయిబాబా సంస్థాన్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ పోస్టును రద్దు చేయాలి. ప్రభుత్వ డిప్యూటీ కలెక్టర్, తహసీల్దార్, ప్రాంతీయ అధికారితో కమిటీ ఉండాలి.
- ప్రస్తుతం తాత్కాలిక కమిటీ సాయిబాబా సంస్థాన్‌ను పరిశీలిస్తోంది. దీని కారణంగా అన్ని కార్యకలాపాలు నెమ్మదించాయి. చాలా పనులపై తీసుకోవాల్సిన నిర్ణయాలు పెండింగ్‌లో ఉన్నాయి. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం సత్వరమే పూర్తి స్థాయి కమిటీని నియమించాలి.
- షిర్డీ సాయిబాబా సంస్థాన్ ట్రస్టీల బోర్డును వీలైనంత త్వరగా నియమించాలి. ఇందులో 50 శాతం ధర్మకర్తలు షిర్డీ నుంచే ఉండాలి.
- ఇవీ చదవండి :
- లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా సహాయకులపై దాడి
- హైవేపై 'ఫాస్ట్ & ఫ్యూరియస్'.. పోలీసుల సూపర్ ఛేజ్.. టైర్లు ఊడినా ఆగని లారీ!