ETV Bharat / bharat

'లక్కీ' గొర్రె పిల్ల వయసు 7 రోజులు.. ధర రూ.2 లక్షలు! - కర్ణాటక విజయపుర జిల్లా వార్తలు

Sheep Sold For Record Price: సాధారణంగా గొర్రెల ధర రూ.వేలల్లోనే ఉంటుంది. కానీ కర్ణాటకకు చెందిన ఓ గొర్రె పిల్ల మాత్రం ఏకంగా రూ. రెండు లక్షలకు అమ్ముడుపోయింది. గొర్రె పిల్లకు ఈ స్థాయి ధర పలకడం వెనుక కారణం లేకపోలేదు. మరి అదేంటో తెలుసుకుందాం.

Sheep Sold For Record Price
గొర్రె పిల్లకు రికార్డు ధర
author img

By

Published : Jan 11, 2022, 4:04 PM IST

Sheep Sold For Record Price: కర్ణాటకలోని విజయపుర జిల్లా ఇండీ పట్టణంలో ఓ గొర్రె పిల్ల రికార్డు ధర పలికింది. ఏడు రోజుల వయసు గల ఈ గొర్రె పిల్లను రూ. రెండు లక్షలు వెచ్చించి మహారాష్ట్రకు చెందిన ఓ గొర్రెల కాపరి కొనుగోలు చేశారు. 'సుల్తాన్'​గా పిలిచే ఈ గొర్రెకు మార్కెట్​లో మంచి డిమాండ్​ ఉంది.

Sheep Sold For Record Price
రూ. 2 లక్షలకు అమ్ముడుపోయిన 'సుల్తాన్​'

ఎందుకు అంత డిమాండ్​..?

కిలారీ జాతికి చెందిన ఈ గొర్రెలు చాలా ప్రత్యేకమైనవి అని చాలా మంది భావిస్తుంటారు. ఈ గొర్రె తమ వద్ద ఉంటే అదృష్టం కలిసి వస్తుందనేది వారి నమ్మకం. అందుకే బానప్పు మాస్టర్​ పూజారీకి చెందిన ఈ గొర్రె పిల్ల అంత ధర పలికింది. దీనిని సొంతం చేసుకునేందుకు కొనుగోలుదారులు పోటీపడ్డారు. ఈ క్రమంలో సిద్ధాంత గ్రామానికి చెందిన నామదేవ ఖోక్రే ఈ 'సుల్తాన్​'ను దక్కించుకున్నారు.

ఇదీ చూడండి : బిడ్డ పాలు తాగలేదని.. 'డాక్టర్' తల్లి ఆత్మహత్య!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.