ETV Bharat / bharat

అన్నాడీఎంకేపై పట్టు కోసం శశికళ న్యాయపోరాటం - అన్నాడీఎంకే జనరల్ సెక్రటరీ పదవి కోసం శశికళ ప్రయత్నాలు

అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ తమిళనాడులో రాజకీయాలు ఉత్కంఠను రేకెత్తిస్తున్నాయి. అన్నాడీఎంకే జనరల్‌ సెక్రటరీ పదవిని తిరిగి దక్కించుకునేందుకు న్యాయస్థానాన్ని ఆశ్రయించారు శశికళ. దీనిపై మార్చి 15న విచారణ జరగనుంది.

Shashikala has approached the court to regain the post of AnnaDMK general secretary.
అన్నాడీఎంకే పార్టీపై పట్టుకోసం శశికళ న్యాయపోరాటం
author img

By

Published : Feb 18, 2021, 4:08 PM IST

మరికొద్ది నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న తమిళనాడులో రాజకీయాలు ఆసక్తికరంగా మారుతున్నాయి. జైలు నుంచి చిన్నమ్మ శశికళ రాక.. ఎన్నికలపై ఉత్కంఠను పెంచింది. అన్నాడీఎంకే జనరల్‌ సెక్రటరీ పదవిని తిరిగి దక్కించుకునేందుకు న్యాయస్థానాన్ని శశికళ ఆశ్రయించారు. తమిళనాడు ముఖ్యమంత్రి పళనిస్వామి, ఉపముఖ్యమంత్రి పన్నీర్‌ సెల్వంకు వ్యతిరేకంగా చెన్నై కోర్టులో ఆమె తాజాగా పిటిషన్‌ దాఖలు చేశారు.

తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత మరణం తర్వాత ఆమె నెచ్చెలి అయిన శశికళ అన్నాడీఎంకే బాధ్యతలు తీసుకున్నారు. పార్టీ జనరల్‌ సెక్రటరీ పదవి చేపట్టారు. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టే లోపే అవినీతి కేసులో జైలుకెళ్లారు. దీంతో పళనిస్వామి సీఎం అయ్యారు. ఆ తర్వాత పళనిస్వామి, పన్నీర్‌ సెల్వం వర్గాలు కలిసిపోయాయి. అనంతరం పళని, పన్నీర్‌ సెల్వం కలిసి అన్నాడీఎంకే జనరల్‌ కౌన్సిల్‌ సమావేశం ఏర్పాటుచేశారు. అందులో శశికళను ప్రధాన కార్యదర్శి పదవి నుంచి తొలగించడమేగాక, పార్టీ నుంచి బహిష్కరించారు. అయితే, ఈ నిర్ణయంపై 2017లో ఆమె న్యాయస్థానంలో దావా వేశారు.

ఇటీవలే జైలు నుంచి విడుదలైన చిన్మమ్మ.. అన్నాడీఎంకే పార్టీని తన హస్తగతం చేసుకునేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టినట్లు తెలుస్తోంది. శశికళ జైలు నుంచి విడుదలై చెన్నైకి వస్తున్నప్పుడు కూడా తన కారుపై అన్నాడీఎంకే జెండా ఉండటం గమనార్హం. ఈ నేపథ్యంలో తాజాగా మరోసారి ఆమె న్యాయస్థానంలో పిటిషన్‌ దాఖలు చేశారు. దీనిపై మార్చి 15న విచారణ జరగనుంది.

ఇదీ చదవండి:బాంబు దాడి : బంగాల్​ మంత్రికి మమత పరామర్శ

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.