Shashi Tharoor congress president election: కాంగ్రెస్ అధ్యక్ష పదవికి పార్టీ సీనియర్ నేత, తిరువనంతపురం ఎంపీ శశిథరూర్ పోటీ ఖరారైంది. పోటీకి నామినేషన్ పత్రాలు తీసుకున్న శశిథరూర్... రేసులో అధికారికంగా బరిలో దిగిన మొదటి అభ్యర్థిగా నిలిచారు. పార్టీ అధ్యక్ష ఎన్నికల్లో పోటీకి సిద్ధమంటూ తన ఉద్దేశాన్ని వ్యక్తపరిచిన తొలి వ్యక్తి కూడా శశిథరూరే కావడం గమనార్హం. అయితే శశిథరూర్.. సెప్టెంబరు 30న నామినేషన్ దాఖలు చేయబోతున్నారని తెలిసింది.
ఇదే విషయంపై ఇటీవల సోనియాను.. శశిథరూర్ కలవగా ఆమె అంగీకరించినట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి. పార్టీలో సంస్కరణలు చేపట్టాలని డిమాండ్ చేస్తున్న జీ-23 సభ్యుల్లో ఉన్న థరూర్.. అధ్యక్ష ఎన్నిక బరిలో నిలవడం ప్రాధాన్యం సంతరించుకుంది. మరోవైపు.. తానూ పోటీకి దిగనున్నట్లు రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గహ్లోత్ ఇప్పటికే ప్రకటించారు.
సెప్టెంబరు 28న గహ్లోత్ నామినేషన్!..
మరోవైపు, కాంగ్రెస్ అధ్యక్ష పదవికి రాజస్థాన్ ముఖ్యమంత్రి ఆశోక్ గహ్లోత్ సెప్టెంబర్ 28న నామినేషన్ దాఖలు చేయనున్నారని సమాచారం. ఈ కార్యక్రమానికి రాజస్థాన్ మంత్రులు, ఎమ్మెల్యేలు, పలువురు హాజరుకానున్నారని తెలుస్తోంది.
ఈ నేపథ్యంలో థరూర్, గహ్లోత్‌ల మధ్య గట్టి పోటీ నెలకొనే అవకాశం ఉంది. అయితే గాంధీ కుటుంబం మద్దతు గహ్లోత్‌కే ఉందని పార్టీ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికపై ఇప్పటికే షెడ్యూల్ విడుదల కాగా.. నేటినుంచి నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ ప్రారంభమైంది. అక్టోబర్ 17న ఎన్నిక జరగనుండగా.. 19న ఫలితాలు వెల్లడికానున్నాయి.
ఇవీ చదవండి: మైనర్‌పై వలస కూలీలు గ్యాంగ్‌రేప్.. రైల్వే ట్రాక్ దగ్గర వదిలి పరార్.. కోడలిని చంపిన మామ!
దేశవ్యాప్తంగా సీబీఐ దాడులు.. ఆన్లైన్ చైల్డ్ పోర్నోగ్రఫీ ముఠాలే లక్ష్యం!