వచ్చే ఏడాది ఏప్రిల్-మేలో బంగాల్లో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో దీదీ ప్రభుత్వాన్ని కూల్చటమే లక్ష్యంగా భాజపా ముందడుగు వేస్తోంది. బంగాల్లో ఎన్నికలు పూర్తయ్యేవరకు ప్రతి నెలా కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా, భాజపా అధ్యక్షుడు నడ్డా రాష్ట్రంలో పర్యటించ నున్నట్లు బంగాల్ భాజపా అధ్యక్షుడు దిలీప్ ఘోష్ తెలిపారు.
అమిత్షా రెండు రోజులు, నడ్డా మూడు రోజులపాటు రాష్ట్రంలో పర్యటించనున్నట్లు ఘోష్ వివరించారు.
"బంగాల్ ప్రజలు కాంగ్రెస్, సీపీఎం, తృణమూల్ పార్టీలకు అవకాశం ఇచ్చారు. కానీ వారు ప్రజల అంచనాలను అందుకోవటంలో విఫలమయ్యారు. భాజపా ప్రజల ఆశలను తీరుస్తుంది."
---దిలీప్ ఘోష్ , బంగాల్ భాజపా అధ్యక్షుడు.
ఎన్నికల నేపథ్యంలో బంగాల్ను పార్టీ ఐదు విభాగాలుగా విభజించింది. ఒక్కో నాయకుడిని ఒక్కో ప్రాంతానికి సంబంధించిన బాధ్యతలను అప్పగించింది.
ఐదుగురు వీరే..
సునీల్ దియోదార్-ఉత్తర బంగాల్
వినోద్ తావదా -రాహ్ బంగా
దుష్యంత్ గౌతమ్- నబద్వీప్ ప్రాంతం
హరీష్ ద్వివేదీ- మిడ్నాపుర్
వినోద్ సోన్కర్ - కోల్కతా
భాజపా సీనియర్ నాయకులు రాష్ట్రంలో పర్యటించనున్న నేపథ్యంలో పార్టీ శ్రేణులు నూతనోత్సాహంతో ఉన్నారు.