ETV Bharat / bharat

'సరిహద్దుల్లో చురుగ్గా ఉండండి.. ఉగ్రవాదుల్ని ఏరిపారేయండి'

author img

By

Published : May 18, 2022, 6:50 AM IST

Amit Shah On Terrorism: భద్రతా బలగాలు, పోలీసులు సమన్వయంతో పనిచేయాలని కేంద్ర హోంమంత్రి అమిత్​ షా దిశా నిర్దేశం చేశారు. ప్రధాని మోదీ శాంతియుత కశ్మీర్​ విజన్​ను నిజం చేయాలని కోరారు. జూన్​ 30న ప్రారంభం కానున్న అమర్​నాథ్​ యాత్ర నేపథ్యంలో నిర్వహించిన ఉన్నత స్థాయి సమీక్షా సమావేశంలో ఆయన పాల్గొన్నారు.

Amit Shah On Terrorism
Amit Shah On Terrorism

Amit Shah On Terrorism: జమ్ముకశ్మీర్​లో శాంతియుత వాతావరణాన్ని నెలకొల్పాలనే ప్రధాని నరేంద్ర మోదీ కలని నిజం చేయాలని.. ఉగ్రవాదాన్ని తుడిచిపెట్టాలని అధికారులను ఆదేశించారు కేంద్ర హోం మంత్రి అమిత్​ షా. సరిహద్దు చొరబాట్లకు అడ్డుకట్ట వేయాలని భద్రతా బలగాలకు సూచించారు. జూన్​ 30న ప్రారంభం కానున్న అమర్​నాథ్​ యాత్ర నేపథ్యంలో నిర్వహించిన ఉన్నత స్థాయి సమీక్షా సమావేశంలో భాగంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. భద్రతా బలగాలు, పోలీసులు సమన్వయంతో పనిచేయాలని పేర్కొన్నారు. ఈ సమావేశానికి జమ్ము కశ్మీర్ లెఫ్టినెంట్​ గవర్నర్​ మనోజ్​ సిన్హా, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ డోవల్​, ఆర్మీ చీఫ్​ జనరల్​ మనోజ్​ పాండే పలువురు ఉన్నతాధికారులు హజర్యయారు.

Amit Shah On Terrorism
సమావేశంలో పాల్గొన్న కేంద్ర హోంమంత్రి అమిత్ షా

సరిహద్దులో ఉగ్రవాద చొరబాట్లు అరికట్టేందుకు నియంత్రణ రేఖ వద్ద భారత సైనికులు అప్రమత్తంగా ఉన్నారని లెఫ్టినెంట్​ జనరల్​ మంజిందర్​ సింగ్​ తెలిపారు. సరిహద్దున ఉగ్రవాద శిబిరాలు ఉన్నాయని చొరబాట్లకు ప్రయత్నిస్తున్నాయని చెప్పారు. అజాదీకా అమృత్​ మహోత్సవ్​లో భాగంగా ఏర్పాటు చేసిన ఫిట్​ ఇండియా క్యాంపైన్​​లో ఆయన పాల్గొన్నారు.

ఇదీ చదవండి: వైన్స్​ షాప్​పై ఉగ్రవాదుల 'గ్రనేడ్​' దాడి.. ఒకరు మృతి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.