ETV Bharat / bharat

చెన్నైకు 'వరద' గండం.. బయటపడే మార్గమేది?

వరదలు సృష్టిస్తున్న(chennai floods 2021) బీభత్సానికి చెన్నై నగరం నిత్యం విలవిలలాడుతోంది. చిన్న వాన పడినా ఎక్కిడికక్కడ నీరు నిలిచిపోతోంది. చెన్నైకు వరద గండం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. తక్షణ చర్యలు చేపట్టకపోతే పరిస్థితి మరింత విషమిస్తుందని తేల్చి చెబుతున్నారు(tamil nadu floods).

chennai floods 2021
చెన్నైకు 'వరద' గండం
author img

By

Published : Nov 17, 2021, 9:06 AM IST

చెన్నైకి 2015లో(chennai flood 2015) వచ్చిన వరదలు యావత్తు దేశాన్ని వణికించాయి. ధన, ప్రాణనష్టం అత్యంత ఎక్కువగానూ అప్పట్లో జరిగింది. కానీ పాలక, అధికార యంత్రాంగాలు ఇప్పటికీ పూర్తిస్థాయిలో మేలుకోలేదు. ప్రణాళికల అమలు ఆలస్యమవుతోంది. ప్రభావమంతమైన నిర్ణయాలు కూడా తీసుకోవడంలేదు(chennai floods 2021). ఈ నేపథ్యంలో నగరానికి భవిష్యత్తు వరద ముప్పు పెరగొచ్చనే అంచనాలు వినిపిస్తున్నాయి.

chennai floods 2021
వరద బీభత్సం

గత వారంలో కురిసిన వర్షాలకు చెన్నై అతలాకుతలమైంది(tamil nadu floods). పరిస్థితి ఎప్పుడు, పూర్తిగా అదుపులోకి వస్తుందో అంచనాలు వేయలేకపోతున్నారు. ఇప్పటికీ భవనాల్లో, సెల్లార్లలోని నీటిని ఇంకా ఎత్తిపోసుకునే పనుల్లోనే నగరాసులున్నారు. చాలాచోట్ల తీవ్ర ఆస్తినష్టం కలిగినట్లు అంచనాలున్నాయి. పెద్ద వానపడితే రెండు, మూడు వారాలపాటు ఆ ప్రభావం నగరంపై కనిపించేంత దారుణస్థితులున్నాయి. వరద నీటికాల్వల ఆక్రమణలు, యంత్రాంగం చర్యల్లో లోపాలు, ప్రణాళికలు సరిగా లేకపోవడం, ఒకవేళ ప్రతిపాదనలు పెట్టినా అమలు సరిగా లేకపోవడం ఇలాంటి ఎన్నో కారణాలు నగరానికి అవరోధంగా మారాయి(floods chennai 2021).

chennai floods 2021
చెన్నై కార్పొరేషన్​ పరిధి

హెచ్చరికలు వస్తున్నా..

  • నగర భౌగోళిక స్థితిని బట్టి క్షేత్రస్థాయిలో మౌళికవసతుల్ని పెంచుకోవాల్సిన అవసరం ఏర్పడింది. ప్రస్తుతం చెన్నైలో చ.కి.మీ.కి 26వేలపైగా జనాభా నివసిస్తున్నారు. నిర్మాణాలు భారీగా పెరిగాయి. పైగా నగరం కొన్నిచోట్ల పల్లంగానూ, మరికొన్నిచోట్ల దిగువగానూ ఉంది. దీనికి తగ్గట్లు పకడ్బందీ వరదకాలువలుండాలి. ఇలాంటి వసతి పూర్తిస్థాయిలో లేకపోవడం పెద్ద ఇబ్బందిగా మారింది.
  • వాతావరణ మార్పుల ప్రమాదకర సూచీ 2021లో ఇతర నగరాలకన్నా చెన్నై హానికరంగా ఉన్నట్లు నివేదిక ఇచ్చారు. 2017లో ఐఐటీ బాంబే నిర్వహించిన మరో సర్వేలో దేశంలోని ప్రమాదకర మెట్రో నగరాల్లో తొలిస్థానంలో ఉంది. దేశంలోని అన్నినగరాలతో పోల్చితే 3వ స్థానంలో ఉంది.
    chennai floods 2021
    చెన్నై ఏరియల్​ వ్యూ
  • ప్రస్తుతమున్న వరదనీటి కాల్వల ముప్పుతో పోల్చితే 2050కి మరో 16శాతం ముప్పు పెరగొచ్చని పరిశోధకులు అంచనాలు వేస్తున్నారు. గ్రేటర్‌ చెన్నై కార్పొరేషన్‌ తన విపత్తుల నిర్వాహణ ప్రణాళికల్లో దీన్ని అంగీకరించారు.
  • నగరంలోని పర్యావరణ ప్రభావాలపై ఈ ఏడాది జనవరిలో గ్రేటర్‌ చెన్నై కార్పొరేషన్‌ ఇచ్చిన నివేదిక ప్రకారం.. నగరవ్యాప్తంగా 44,883 కి.మీ మేర వరదకాలువలుంటే, అందులో 11,949కి.మీ కాలువలకు ఎలాంటి అనుసంధానంలేక తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఈ సమస్యలన్నీ పోవడానికి రూ.120కోట్లు ఖర్చుచేస్తున్నట్లు వారు అందులో ప్రకటించారు. అదనపు కాలువల ప్రస్తావన ఇక్కడ రాలేదు.

టోక్యోను చూసి నేర్చుకోవాలి..

chennai floods 2021
టోక్యోలోని అతిభారీ భూగర్భ బంకర్‌

జపాన్‌ రాజధాని టోక్యోలో 1.5కోట్ల జనాభా ఉంది. విపరీత నిర్మాణాల కారణంగా వరదనీటిని ఎదుర్కొనేందుకు భూగర్భ వర్షపునీటినిల్వ బంకర్లను నిర్మించారు. రోడ్లపై, వీధుల్లో పారే నీరంతా ఆ బంకర్లలోకి వెళ్లేలా చేస్తున్నారు. ఆ నీటిని తిరిగి వినియోగించుకునేలా ప్రణాళిక చేసుకుంటున్నారు. చెన్నైలో కూడా ఇది సాధ్యమని నిపుణులు చెబుతున్నారు. రోడ్లు, మైదానాలు, ఇతర ప్రభుత్వ స్థలాల్లో ఇలాంటి భూగర్భ బంకర్లను నిర్మించి వేసవిలో నీటిఎద్దడి వచ్చినప్పుడు దీన్ని వినియోగించుకోవచ్చని సూచిస్తున్నారు.

'అడయార్‌'కు ఊరటనిచ్చేలా..

నగరంలోని అడయార్‌ నది పరిమితికి మించి చెంబరంబాకం రిజర్వాయర్‌ నుంచి వరదల సమయంలో నీరు వదులుతున్నారు. దీంతో చుట్టుపక్కల ప్రాంతాలన్నీ మునుగుతున్నాయి. ఈ నదిపై ఒత్తిడి తగ్గించేలా రింగు రోడ్డువైపు కొన్ని చోట్ల కాలువల్ని నిర్మించి వరదనీటిని దారి మళ్లించేందుకు అవకాశాలున్నాయని అన్నా విశ్వవిద్యాలయం నిర్వహించిన మరో పరిశీలనలో తేలింది.

చిన్న కాలువలకు కావాలి రక్షణ

నగరంలో పాతరోజుల్లో సహజంగా ఉన్న కాలువలు చాలావరకు ఆక్రమణల్లోనే ఉన్నాయి. రాజకీయ కారణాలతో వీటిని తొలగించకుండా ఉంచారు. వాటన్నింటినీ గుర్తించి వృద్ధి చేయాల్సిన అవసరం కనిపిస్తోంది. అలాగే వర్షాలు పడినప్పుడు నగర శివార్ల నుంచి నీరు నగరంలోకి వచ్చేస్తోంది. శివారు చెరువులు, కుంటలు ఆక్రమణలకు గురవడమూ మరో కారణం. వీటికి పునర్‌వైభవం తేవాల్సి ఉందని నిపుణులు చబుతున్నారు.

కొంతవరకు చర్యలు..

చెన్నై-కొసస్తలై నది బేసిన్‌ కోసం రూ.3345.52కోట్ల నిధులు వెచ్చించి కొన్ని ప్రతిపాదనలు రూపొందించారు. దీనిద్వారా 19లక్షలమందికి మేలు జరుగుతుందని చెబుతున్నారు. ఈ ప్రాజెక్టుతో నగరంలోని 30శాతం భూభాగంలో పనులు చేపట్టవచ్చు. అయితే ఇంకా అనుమతులు రాలేదు. ఇదే జరిగితే ఆ బేసిన్‌లో వరదనీటినుంచి రక్షణ పొందే కాలువల్ని, ఇతర ఏర్పాట్లని పొందొచ్చు.

అడయార్, కూవం, కొసస్తలై నదుల పరిరక్షణకు ప్రపంచబ్యాంకు నిధులు కూడా ఇస్తోందని అధికారులు చెబుతున్నారు. వరదల్ని ముందే గుర్తించే వ్యవస్థను (ఎర్లీ ఫ్లడ్‌ వార్నింగ్‌ సిస్టం)ను చెన్నై మెట్రోపాలిటన్‌ ప్రాంతంలో తేవాలని చూస్తున్నారు. మరోవైపు దక్షిణ చెన్నైలోని కోవలం బేసిన్‌లో జర్మన్‌ డెవలప్‌మెంట్ కార్పొరేషన్‌ ద్వారా మరిన్ని నిధులు అందడం వల్ల వరదనీటికాలువల అభివృద్ధిపనులు చేస్తున్నారు.

ఇదీ చూడండి:- జలదిగ్బంధంలో చెన్నై.. వీధుల్లో పడవ ప్రయాణం!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.