పంజాబ్లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో నలుగురు యువకులు మృతి చెందగా.. మరికొంత మందికి గాయపడ్డారు. శనివారం రాత్రి అమృత్సర్లో జరిగిందీ ఘటన. స్థానికుడు దల్జీత్ సింగ్ తెలిపిన వివరాల ప్రకారం.. అట్టారీ రోడ్డులోని ఘరీందర్ ప్రాంతంలో శనివారం రాత్రి ఓ ఆటో, కారు ఢీ కొన్నాయి. ఈ ప్రమాద సమయంలో ఆటోలో 12 మంది యువకులు ఉన్నారు.
నేస్తా గ్రామానికి చెందిన వారంతా.. ఖాస ప్రాంతంలో పనిచేస్తున్నారు. పని ముగించుకొని ఆటోలో ఇళ్లకు బయలుదేరారు. అదే సమయంలో వారికి ఎదురుగా అతివేగంగా వస్తున్న ఓ కారు ఆటోను ఢీకొట్టింది. దీంతో ఆటోలో ఉన్నవారికి తీవ్రగాయాలయ్యాయి. ఒకరు అక్కడికక్కడే మృతి చెందగా.. మరో ముగ్గురు ఆస్పత్రికి తరలిస్తుండగా మృతి చెందారు. గాయపడినవారి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలిపారు.