ETV Bharat / bharat

దొంగల బీభత్సం.. 17 ఏటీఎంలు క్లోజ్.. గ్రామస్థులకు తిప్పలు! - బిహార్​ గోపాల్​ గంజ్​

17 ATMs Closed: బిహార్​లోని గోపాల్​గంజ్​లో దొంగలు రెచ్చిపోతున్నారు. ముఖ్యంగా గ్రామాల్లో ఉన్న ఏటీఎంలను టార్గెట్​ చేసుకుని లక్షల రూపాయలను ఎత్తుకెళ్తున్నారు. దీంతో ఈ ఏటీఎం దొంగతనాల్ని అరికట్టడానికి వివిధ గ్రామాల్లో ఉన్న 17 ఏటీఎంలను తాత్కాలికంగా మూసివేశారు పోలీసులు. ఏటీఎంలకు బాగా అలవాటు పడిన ఆయా గ్రామాల ప్రజలు డబ్బులు విత్​డ్రా చేయడానికి, డిపాజిట్​ చేయడానికి తీవ్ర అవస్థలు పడుతున్నారు.

ఏటీఎంలను మూసివేస్తున్న పోలీసులు
ఏటీఎంలను మూసివేస్తున్న పోలీసులు
author img

By

Published : Jul 16, 2022, 9:32 PM IST

17 ATMs Closed: కేంద్ర ప్రభుత్వం డిజిటల్​ ఇండియా పేరుతో వివిధ పథకాలను అమలు చేస్తోంది. డిజిటల్​ చెల్లింపులపై ప్రజలకు, దుకాణదారులకు అవగాహన కల్పిస్తోంది. చిన్నచిన్న గ్రామాల్లో సైతం ఏటీఎం మెషీన్లు ఏర్పాటు చేస్తోంది. గ్రామీణ ప్రజలు కూడా ఇటీవల కాలంలో డబ్బులు విత్​డ్రా చేయడానికి, డిపాజిట్​ చేయడానికి బ్యాంక్​కు వెళ్లకుండా.. అన్నిరకాల బ్యాంకింగ్​ పనులు తమ ఊర్లో ఉన్న ఏటీఎంలోనే పూర్తి చేసుకుంటున్నారు. అయితే ఇదే అదనుగా తీసుకున్న బిహార్​.. గోపాల్​​గంజ్​ జిల్లాలోని దొంగలు రెచ్చిపోతున్నారు.

ఏటీఎంలను మూసివేస్తున్న పోలీసులు
ఏటీఎంలను మూసివేస్తున్న పోలీసులు

గత మూడు నెలలుగా ప్రతిరోజూ రాత్రి పలు గ్రామాల్లో ఉన్న ఏదో ఒక ఏటీఎంను టార్గెట్​ చేసుకుని.. రూ.లక్షల్లో లూటీ చేస్తున్నారు. దీంతో దొంగతనాలను అరికట్టడం బిహార్​ పోలీసులకు పెద్ద తలనొప్పిగా మారింది. చివరికి కొన్ని గ్రామాల ఏటీఎంలు సురక్షిత ప్రాంతాల్లో లేవని గుర్తించి ఓ నిర్ణయానికి వచ్చారు. 17 టాటా ఇండిక్యాష్​ ఏటీఎంలను తాత్కాలికంగా మూసివేశారు పోలీసులు.

"గత మూడు నెలల నుంచి ఏటీఎం దొంగతనాలు బాగా ఎక్కువయ్యాయి. రాత్రి సమయంలో దొంగలు గ్యాస్​ కటర్లతో కట్​ చేసి దోచుకెళ్తున్నారు. హార్దియా గ్రామంలో రెండు ఏటీఎంల నుంచి సుమారు రూ.7 లక్షలు ఎత్తుకెళ్లారు. సరైన భద్రత లేని ప్రదేశాల్లో ఎవరి అనుమతితో బ్యాంకులు ఏర్పాటు చేశారన్న కోణంలో దర్యాప్తు చేపడుతున్నాం. ప్రస్తుతానికి 17 టాటా ఇండిక్యాష్​ ఏటీఎంలను మూసేవేశాం. సురక్షిత ప్రాంతాలకు తరలించే వరకు వాటిని తెరవలేం. జనసమూహం ఉన్న ప్రాంతాల్లో మాత్రమే తిరిగి వాటిని ప్రారంభిస్తాం."
-- సంజీవ్​ కుమార్, ఎస్​డీపీఓ

లక్షల రూపాయలు లూటీ.. గోపాల్​గంజ్​ జిల్లాలోని ఠావే పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని ఉన్న కబిలాస్‌పుర్‌ గ్రామంలో ఎస్‌బీఐ ఏటీఎంను లూటీ చేసి లక్షల రూపాయలను దొంగలు దోచుకెళ్లారు. కానీ గ్యాస్​ కటర్​ను మాత్రమ ఏటీఎంలోనే వదిలేసి పరారయ్యారు. అదే రోజు మరో గ్రామం హార్దియాలో టాటా ఇండిక్యాష్‌కు చెందిన రెండు ఏటీఎంలను కట్ చేసి రూ.7 లక్షల రూపాయలను ఎత్తుకెళ్లారు దొంగలు.

పోలీసులు విఫలమయ్యారా?.. అయితే ఏటీఎంల మూసివేతపై స్థానికులు వేర్వేరుగా స్పందిస్తున్నారు. దొంగతనాలను అరికట్టడంలో పోలీసులు వైఫల్యమే ఈ పరిస్థితికి దారితీసిందని ఆరోపిస్తున్నారు. తమ బ్యాంకు ఖాతాలో ఉన్న సొమ్మును విత్​డ్రా చేసుకోవడానికి కూడా నగరంలో ఉన్న బ్యాంకులకు లేదా ఏటీఎంలకు వెళ్లాల్సివస్తోందని వాపోతున్నారు.

ఇదీ చదవండి: సహోద్యోగులపై ఆర్మీ జవాన్ కాల్పులు.. ఆపై తనను తాను కాల్చుకొని..

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.