ETV Bharat / bharat

ఏడేళ్ల బాలికపై హత్యాచారం- మామపై అనుమానం - రాజస్థాన్​ అప్డేట్స్​

ఆడుకోవడానికెళ్లిన ఓ చిన్నారిపై అత్యాచారం, హత్య జరిగిన ఘటన రాజస్థాన్​లో బయటపడింది. ఏడేళ్ల బాలికపై సొంత మామయ్యే ఈ దురాగతానికి పాల్పడి ఉంటాడనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

Seven-year-old allegedly raped, murdered in Rajasthan
ఏడేళ్ల బాలికపై హత్యాచారం- మామయ్యపై అనుమానం!
author img

By

Published : Dec 23, 2020, 12:39 PM IST

రాజస్థాన్​లో దారుణ ఘటన వెలుగుచూసింది. జైపుర్​లోని విశ్వకర్మ పారిశ్రామిక ప్రాంతంలో ఏడేళ్ల బాలికపై అత్యాచారం చేసి, ఆపై హత్యచేశాడో దుండగుడు.

అసలేం జరిగిందంటే..

విశ్వకర్మ పోలీస్​ స్టేషన్​ పరిధిలోని రోడ్​ నంబర్​-17 సమీపంలో ఓ చిన్నారి బంధువుల ఇంటికి ఆడుకోవడానికి వెళ్లింది. తన అమ్మమ్మతో పాటు వెళ్లిన ఆ బాలిక సాయంత్రమైనా తిరిగి ఇంటికి రాలేదు. ఇంతలో తల్లిదండ్రులు ఆమె కోసం వెతకడం ప్రారంభించారు. అయినా కనిపించకపోవడం వల్ల.. స్థానిక పోలీస్​ స్టేషన్​లో ఫిర్యాదు చేశారు.

దర్యాప్తు చేపట్టిన పోలీసులు.. తన మామయ్య ఇంటి వద్ద అనుమానాస్పద స్థితిలో పడి ఉన్న మైనర్​ మృతదేహాన్ని గుర్తించారు. ఆ చిన్నారిని అత్యాచారం చేసి, గొంతుకోసి చంపినట్టు పోలీసులు తేల్చారు. ఫోరెన్సిక్​ నిపుణులు సంఘటనా స్థలానికి చేరుకుని బాధితురాలి నమూనాలను సేకరించారు.

ఆ చిన్నారి మామయ్య కూడా స్పృహ కోల్పోయి అక్కడే పడి ఉండటం పలు అనుమానాలకు తావిస్తోంది. ఈ కేసులో అతడే ప్రధాన నిందితుడిగా భావించిన అధికారులు.. దర్యాప్తు సాగిస్తున్నారు.

ఇదీ చదవండి: 24 కి.మీ వెనక్కి దూసుకెళ్లిన ​రైలు- ఆపై బోల్తా

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.