ETV Bharat / bharat

Self Treatment For Diarrhoea : 10 కర్పూరం బిళ్లలు మింగేసిన యువకుడు.. వికటించిన 'యూట్యూబ్'​ వైద్యం.. ఆస్పత్రిలో.. - యూట్యూబ్​ చూసి వైద్యం చేసుకున్న యువకుడి

Self Treatment For Diarrhoea Goes Wrong : డయోరియా బారిన పడ్డ ఓ యువకుడు యూట్యూబ్​లో చూసి సొంత వైద్యం చేసుకున్నాడు. ఆ తర్వాత వైద్యం వికటించి ఆరోగ్యం విషమించింది. దీంతో అతడి కుటుంబ సభ్యులు ఆస్పత్రి తరలించారు. ఈ ఘటన ఝార్ఖండ్​లో జరిగింది.

Self Treatment For Diarrhea Goes Wrong
Self Treatment For Diarrhea Goes Wrong
author img

By ETV Bharat Telugu Team

Published : Aug 27, 2023, 11:08 AM IST

Updated : Aug 27, 2023, 11:22 AM IST

Self Treatment For Diarrhoea Goes Wrong : ఝార్ఖండ్​.. లాతేహార్ జిల్లాలో ఓ యువకుడు యూట్యూబ్​ చూసి సొంత వైద్యం చేసుకున్నాడు. విరేచనాలు తగ్గేందుకు యూట్యూబ్​లో సూచించిన విధంగా 10 కర్పూరం బిళ్లలు మింగాడు. ఆ తర్వాత వైద్యం వికటించి ఆరోగ్యం విషమించింది. దీంతో అతడిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

ఇదీ జరిగింది.. బలుమత్ మండలంలోని టోటీ హెస్లా గ్రామంలో నివసిస్తోన్న అవధేశ్​ కుమార్ సాహుకు డయేరియా వచ్చింది. ఆస్పత్రికి వెళితే చాలా ఖర్చు అవుతుందని భావించాడు. ఈ క్రమంలో యూట్యూబ్​లో డయోరియా తగ్గేందుకు చిట్కాల కోసం వెతికాడు. కర్పూరం తింటే విరేచనాలు ఆగిపోతాయని ఓ వీడియో ద్వారా తెలుసుకున్నాడు. అందులో పేర్కొన్న ఇంటి చిట్కాల ప్రకారం 10 కర్పూరం మాత్రలను మింగాడు. అయితే ఈ ఇంటి చిట్కా నుంచి ఉపశమనం పొందటానికి బదులుగా, అతడి ఆరోగ్య పరిస్థితి మరింత దిగజారంది. అవధేశ్​ పరిస్థితి అకస్మాత్తుగా క్షీణించడం చూసి.. కుటుంబ సభ్యులు అసలు ఏం జరిగిందని ఆరా తీశారు. దీంతో అవధేశ్​.. తాను విరేచనాలు తగ్గడానికి కర్పూరం మాత్రలు మింగినట్లు చెప్పాడు.

Self Treatment For Diarrhea Goes Wrong
బాధితుడిని ఆస్పత్రికి తరలిస్తున్న కుటుంబ సభ్యులు

దీంతో అతడిని హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు కుటుంబ సభ్యులు. అక్కడ బాధితుడికి వైద్యులు ప్రథమ చికిత్స అందించారు. అయితే పరిస్థితి విషమంగా ఉండడం వల్ల మెరుగైన చికిత్స కోసం రిమ్స్‌కు తరలించారు. ఈ విషయమై డాక్టర్ అమర్ నాథ్ మాట్లాడారు. యువకుడికి విరేచనాలు అయ్యాయని.. అతడు యూట్యూబ్ ద్వారా సొంత చికిత్సను ప్రయత్నించాడని చెప్పారు. అయితే కర్పూరం ప్రభావం ఇంకా ఉందని.. అందుకే ఆ యువకుడు కనీసం రెండు మూడు రోజులు ఆస్పత్రిలో చేరాల్సి వస్తుందని తెలిపారు.

ఇంటర్నెట్​ పుణ్యమా అని ఇటీవల కాలంలో ఇలాంటి ఘటనలు ఎక్కవుగా జరుగుతున్నట్లు అధికారులు చెబుతున్నారు. యూట్యూబ్​ లాంటి సోషల్​ మీడియా మాధ్యమాల్లో సూచించిన చిట్కాలు​ అనుసరిస్తూ కొంత మంది సొంత వైద్యం చేసుకుంటున్నారని తెలిపారు. అందులో సూచించిన మాత్రలను శరీర పరిస్థితితో సంబంధం లేకుండా వేసుకుంటూ ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారని చెప్పారు. అయితే, ఇలా చిట్కాలు కొన్నిసార్లు మేలు చేసినా.. అన్ని వేళల్లో అవి పనికి రావని నిపుణులు అంటున్నారు. అనారోగ్యానికి గురైనపుడు యూట్యూబ్​ బదులుగా వైద్యుల వద్ద చికిత్స పొందడం మంచిదని చెబుతున్నారు. వారు ఇచ్చిన గుర్తింపు ఉన్న మందులు వాడటం ఉత్తమమని సూచిస్తున్నారు.

నాటు వైద్యం వికటించి.. 8 నెలల బాలుడికి అస్వస్థత!

వికటించిన నాటు వైద్యం.. మహిళ మృతి.. ముగ్గురి పరిస్థితి విషమం

Last Updated : Aug 27, 2023, 11:22 AM IST

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.