ETV Bharat / bharat

'రాజద్రోహం, ఉపా చట్టాలు రద్దు చేయాల్సిందే'

రాజద్రోహం, చట్టవ్యతిరేక కార్యకలాపాల నివారణ చట్టం (యూఏపీఏ) వంటివి రద్దు చేయాల్సిందేనని సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తులు జస్టిస్‌ ఆఫ్తాబ్‌ ఆలం, జస్టిస్‌ గోపాలగౌడ, జస్టిస్‌ దీపక్‌ గుప్తా, జస్టిస్‌ మదన్‌ బి.లోకుర్‌ డిమాండ్‌ చేశారు. ఈ చట్టాలు దుర్వినియోగం కాకుండా న్యాయవ్యవస్థే అడ్డుకోవాలని అభిప్రాయపడ్డారు. వీటిని సమీక్షించి, అందులో ఉన్న రాజ్యాంగ వ్యతిరేక అంశాలను కొట్టేయాలని చెప్పారు.

sedition law in india
భారత్​లో రాజద్రోహం చట్టం
author img

By

Published : Jul 25, 2021, 8:12 AM IST

రాజద్రోహం, చట్టవ్యతిరేక కార్యకలాపాల నివారణ చట్టం (యూఏపీఏ) వంటివి రద్దు చేయాల్సిందేనని సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తులు నలుగురు డిమాండ్‌ చేశారు. ఇవి దుర్వినియోగం కాకుండా న్యాయవ్యవస్థే అడ్డుకోవాలని, ఈ చట్టాలను సమీక్షించి అందులో ఉన్న రాజ్యాంగ వ్యతిరేక అంశాలను కొట్టేయాలని అభిప్రాయపడ్డారు. అక్రమ అరెస్టులతో ఏళ్ల తరబడి నిర్బంధంలో ఉండడానికి కారకులైన వారిని వ్యక్తిగతంగా బాధ్యుల్ని చేసి, వారినుంచే పరిహారం ఇప్పించేలా జవాబుదారీతనాన్ని రూపొందించాలని కోరారు. 'ప్రజాస్వామ్యం, అసమ్మతి, అమానుషమైన చట్టాలు' అనే అంశంపై 'క్యాంపెయిన్‌ ఫర్‌ జ్యుడిషియల్‌ అకౌంటబిలిటీ అండ్‌ రీఫామ్స్‌' సంస్థ శనివారం సాయంత్రం నిర్వహించిన వెబినార్‌లో సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తులు జస్టిస్‌ ఆఫ్తాబ్‌ ఆలం, జస్టిస్‌ గోపాలగౌడ, జస్టిస్‌ దీపక్‌ గుప్తా, జస్టిస్‌ మదన్‌ బి.లోకుర్‌ మాట్లాడారు.

ప్రభుత్వాలను ప్రశ్నించడం ప్రజల హక్కు

"ప్రజాస్వామ్యంలో భిన్నాభిప్రాయాలకు తప్పితే క్రూరమైన చట్టాలకు తావులేదు. కొన్ని సంవత్సరాలుగా అసంతృప్త గళాలను, ప్రభుత్వాలను ప్రశ్నించే గొంతులను నొక్కేయడానికి చట్టాలను దుర్వినియోగం చేస్తున్నారు. ప్రభుత్వాలను ప్రశ్నించడం ప్రజల ప్రాథమిక హక్కు. ఇలాంటి వ్యవస్థలో రాజద్రోహ చట్టం ఉండటం విచారకరం. భారతీయులెవ్వరూ గొంతెత్తకుండా ఉండటానికి వలసవాదులు ప్రవేశపెట్టిన చట్టం అది. హింసకు ప్రేరేపించడం, శాంతిభద్రతలకు తీవ్రమైన విఘాతం కలిగించడంలాంటి ఘటనలే రాజద్రోహం కిందికి వస్తాయని, కేవలం ఉద్యమాల్లో పాల్గొన్నంత మాత్రాన అది రాజద్రోహం కిందికి రాదని సుప్రీంకోర్టు ఇదివరకే స్పష్టంచేసింది. రాజద్రోహ చట్టానికి సాధ్యమైనంత త్వరగా మంగళం పలకాలి. ఉగ్రవాదులను అణచివేయడానికి చట్టం ఉండాల్సిందే. అందులో ఉగ్రవాద నిర్వచనం అత్యంత స్పష్టంగా ఉండాలి. పార్కిన్సన్స్‌తో బాధపడుతున్న 84 ఏళ్ల స్టాన్‌స్వామికి బెయిల్‌ మంజూరు చేయకపోవడాన్ని బట్టిచూస్తే మనం మనుషులం కాదా? మానవత్వ కోణాలన్నీ మరిచిపోయామా? అన్న ప్రశ్న తలెత్తుతోంది.

-జస్టిస్‌ దీపక్‌ గుప్తా

"బెయిల్‌ ఇవ్వడానికి, న్యాయ సమీక్ష చేయడానికి ఉన్నత న్యాయస్థానాలకున్న అధికారాలను కాజేసే నిబంధనలను చట్టంలో చేర్చడం రాజ్యాంగ విరుద్ధం. ఏదైనా చట్టం దారుణమైన దుర్వినియోగానికి గురవుతోందని, రోజూ ఆ పని జరుగుతోందని భావించినప్పుడు కోర్టులు కూడా గత తీర్పులను పునఃసమీక్షించాలి. ఏళ్లబడి నిర్బంధంలో నలిగి నిర్దోషులుగా బయటపడినవారికి తప్పనిసరిగా పరిహారం చెల్లించాలి. తప్పుడు కేసులు నమోదుచేసిన అధికారులే సొంత డబ్బుతో ఆ పరిహారం చెల్లించేలా చూడాలి. ఉగ్రవాద చట్టం కింద కేసులు నమోదైనవారికి బెయిల్‌ ఇస్తే సామాజిక మాధ్యమాల్లో ఎలాంటి విమర్శలు వస్తాయోనని జిల్లా కోర్టులు భయపడుతుంటాయి. ఇలాంటి విషయాల్లో ఉన్నత న్యాయస్థానాలు ముందు నడవాలి. హక్కుల సాధన కోసం సుప్రీంకోర్టును ఆశ్రయించడం కూడా ప్రాథమిక హక్కేనని రాజ్యాంగం చెప్పింది. కోర్టులు మానవ హక్కుల సంరక్షకుడిగా వ్యవహరించాలి. అస్పష్టంగా ఉన్న చట్టాలను కొట్టేయాలి. లేదంటే అందులో మార్పులు చేస్తే తప్ప వాటిని చట్టాలుగా అంగీకరించబోమని చెప్పాలి" అని జస్టిస్‌ దీపక్‌ గుప్తా పేర్కొన్నారు.

ఇక్కడ న్యాయ ప్రక్రియే పెద్ద శిక్ష

జస్టిస్‌ ఆఫ్తాబ్‌ ఆలం మాట్లాడుతూ ఉపా కేసుల్లో శిక్షల శాతం చాలా తక్కువ ఉంటుందని, ఇక్కడ నడిచే న్యాయ ప్రక్రియే పెద్ద శిక్ష అని అభిప్రాయపడ్డారు. దర్యాప్తు, కేసుల విచారణ ఆలస్యంగా సాగడంవల్ల బాధితులు ఇబ్బందులు పడాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. నిందితులకు బెయిల్‌ ఇవ్వకుండా కోర్టులను ఉపా చట్టమే అడ్డుకుంటోందని జస్టిస్‌ గోపాలగౌడ చెప్పారు. విచారణ పూర్తికాకుండా బెయిల్‌ ఇవ్వడం దాదాపు అసంభవమన్నారు. జీవించే హక్కుకు ఇది పూర్తిగా విరుద్ధమని అభిప్రాయపడ్డారు. భద్రతాపరమైన చట్టాల్లో విస్తృతమైన సంస్కరణలు తీసుకురావాల్సి ఉందన్నారు. దీర్ఘకాలంపాటు నిర్బంధంలో ఉండి నిర్దోషులుగా బయటపడిన వారికి భారీ పరిహారం ఇచ్చేలా కోర్టులు ఆదేశించాలని జస్టిస్‌ మదన్‌ బి లోకుర్‌ అభిప్రాయపడ్డారు. కేవలం నిర్దోషులుగా బయటపడటాన్ని కాకుండా అరెస్ట్‌ నుంచి చివరి వరకు ఉన్న అన్ని అంశాలనూ చూడాలన్నారు. అక్రమ కేసులో అరెస్ట్‌ చేసిన శాస్త్రవేత్త నంబి నారాయణన్‌కు రూ.50 లక్షల పరిహారం ఇచ్చినట్లుగానే, ఇలాంటి తప్పుడు కేసుల్లో ఇరుక్కొని బయటపడినవారికి భారీ పరిహారం అందించాలని అభిప్రాయపడ్డారు. బాధితుల మానసిక వేదనకూ పరిహారం కల్పించాలని సూచించారు.

ఇవీ చూడండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.