తమిళనాడులోని తిరుచిరాపల్లి విమానాశ్రయంలో బాంబు వార్త సోమవారం కలకలం రేపింది. దీంతో భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు అధికారులు. విమానాశ్రయంలో బాంబు ఉన్నట్టు గుర్తుతెలియని వ్యక్తి నుంచి ఓ బెదిరింపు కాల్ రావడం వల్ల.. ఈ మేరకు చర్యలు తీసుకున్నారు. అనంతరం.. చెన్నై విమానాశ్రయంలోనూ భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు.
అప్రమత్తమైన అధికారులు.. విమానాశ్రయంలోని 200 మంది ప్రయాణికులను అక్కడి నుంచి తరలించారు. ప్రాంగణ ప్రాంతంలో కేంద్ర పారిశ్రామిక భద్రతా సిబ్బంది(సీఐఎస్ఎఫ్), పోలీసుల బృందంతో పాటు స్నైఫర్ డాగ్స్, మెటల్ డిటెక్టర్లు భద్రతా చర్యలు చేపట్టాయి.
ఇదీ చదవండి: ఆర్నెల్లుగా బంధీగా వృద్ధ జంట- అసలేం జరిగింది?