నందిగ్రామ్ రిటర్నింగ్ అధికారికి పూర్తిస్థాయి భద్రత కల్పించినట్లు బంగాల్ ప్రభుత్వం ఎన్నికల సంఘానికి తెలిపింది.
రిటర్నింగ్ అధికారికి బెదిరింపులు వచ్చిన నేపథ్యంలో ఆయనకు భద్రత కల్పించాలని ఈసీ ఆదేశాలు జారీ చేసింది. రిటర్నింగ్ అధికారికి వైద్యసదుపాయం అందించాలని ప్రభుత్వానికి సూచించింది.
నందిగ్రామ్ నియోజకవర్గంలో బంగాల్ సీఎం మమతా బెనర్జీ 1, 956 ఓట్ల తేడాతో ఓటమిపాలయ్యారు.