ETV Bharat / bharat

భారీ పేలుడుకు నక్సల్స్ కుట్ర- 15 కిలోల బాంబులతో... - ఝార్ఖండ్​​లో 15 కిలోల ఐఈడీ స్వాధీనం

ఝార్ఖండ్​​లోని బొకారో ప్రాంతంలో మావోయిస్టులు భారీ పేలుడుకు చేసిన ప్లాన్​ను సమర్థంగా తిప్పికొట్టారు సీఆర్​పీఎఫ్​ జవాన్లు, రాష్ట్ర పోలీసులు. నిఘా వర్గాలు ఇచ్చిన విశ్వసనీయ సమాచారం మేరకు పేలుడు కుట్రను అడ్డుకోగలిగినట్లు ప్రకటించారు.

IED (representative image)
ఐఈడీ (ప్రతీకాత్మక చిత్రం)
author img

By

Published : Sep 8, 2021, 7:35 PM IST

సెంట్రల్ రిజర్వ్​ పోలీస్​ దళాలు (సీఆర్​పీఎఫ్​)​, స్థానిక పోలీసులు సంయుక్తంగా.. ఝార్ఖండ్​​లో భారీ పేలుడు కుట్రను భగ్నం చేశారు. బుధవారం ఉదయం 15కిలో ఐఈడీని స్వాధీనం చేసుకోవడం ద్వారా పెను దాడిని అడ్డుకోగలిగారు.

ఆపరేషన్ ఇలా..

నిఘా వర్గాల నుంచి అందిన విశ్వసనీయ సమాచారం మేరకు.. సీఆర్​పీఎఫ్​ 154 బెటాలియన్​​ దళం సభ్యులు, ఝార్ఖండ్​​ పోలీసులు సంయుక్తంగా ఈ ఆపరేషన్ చేపట్టారు.

అనుమానిత సీతూ ప్రాంతాంతో అణువణువూ పరిశీలించారు. ఈ గాలింపులో మక్కాన్​-చేచారియ మధ్య ఉన్న ఓ కల్వర్టు వద్ద 15 కిలోల శక్తిమంతమైన ఐఈడీ ఉన్నట్లు గుర్తించారు. బాంబ్ స్క్వాడ్ సాయంతో దానిని నిర్వీర్యం చేసి స్వాధీనం చేసుకున్నట్లు సీఆర్​పీఎఫ్​ ఓ ప్రకటనలో తెలిపింది.

భద్రతా దళాలే లక్ష్యంగా మావోయిస్టులు ఈ పేలుడుకు కుట్ర పన్నినట్లు నిఘా​ వర్గాలు స్పష్టమైన సమాచారాన్ని ఇచ్చాయని వెల్లడించింది సీఆర్​పీఎఫ్​.

ఇదీ చదవండి: 'సూపర్‌ కాప్‌' అవ్వాలని.. అంబానీ నుంచి డబ్బు లాగాలని..

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.