ETV Bharat / bharat

కశ్మీర్​లో జవాన్ల కాన్వాయ్‌పై ఉగ్రవాదుల దాడి - బలగాలపై దాడి

attack on security forces
బలగాలపై ఉగ్రదాడి
author img

By

Published : Aug 12, 2021, 3:15 PM IST

Updated : Aug 12, 2021, 10:18 PM IST

15:13 August 12

కశ్మీర్​లో జవాన్ల కాన్వాయ్‌పై ఉగ్రవాదుల దాడి

జమ్ముకశ్మీర్​ కుల్గాంలో బీఎస్‌ఎఫ్‌ జవాన్ల కాన్వాయ్‌పై ఉగ్రవాదులు దాడికి తెగబడ్డారు. జవాన్లు, ఉగ్రవాదుల మధ్య కాల్పులు జరిగినట్లు కశ్మీర్ ఐజీపీ విజయ్​ కుమార్​ తెలిపారు. కొందరు ఉగ్రవాదులను బందీగా పట్టుకున్నట్లు వెల్లడించారు. కుల్గాం జిల్లాలోని మల్​పోరా వద్ద జమ్ము-శ్రీనగర్​ జాతీయ రహదారిపై ఈ దాడి జరిగిందని మరో అధికారి తెలిపారు.

కొనసాగుతున్న కాల్పులు..

లష్కర్​-ఏ-తోయిబాకు చెందిన ఇద్దరు ఉగ్రవాదులను భద్రతా బలగాలు పట్టుకున్నాయని కశ్మీర్​ ఐజీపీ విజయ్​ కుమార్​ తెలిపారు. ముష్కరులకు, భద్రతా సిబ్బందికి మధ్య కాల్పులు జరుగుతున్నాయని చెప్పారు. ఈ దాడుల్లో ఇద్దరు భద్రతా సిబ్బందికి, మరో ఇద్దరు పౌరులకు గాయాలయ్యాయని పేర్కొన్నారు.

Last Updated : Aug 12, 2021, 10:18 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.