జమ్ముకశ్మీర్ పూంచ్ జిల్లాలో ఉగ్రవాదుల కుట్రను భగ్నం చేశాయి భద్రతాదళాలు. ఉగ్రవాదుల స్థావరం గుర్తించి 19 గ్రెనేడ్లు స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు తెలిపారు.
జమ్ము-పూంచ్ జాతీయ రహదారి(144ఏ)లో భద్రతా దళాలపై ఉగ్రవాదులు దాడికి ప్రణాళిక రచించారని ఓ సైనికాధికారి తెలిపారు. ముందస్తు సమాచారంతో ఫాగ్లాలోని సురంకోట్ ప్రాంతంలో రాష్ట్రీయ రైఫిల్స్, పోలీసులు గాలింపు చర్యలు చేపట్టినట్లు పేర్కొన్నారు.
జమ్ములో ఇటీవల కాలంలో భారీ మొత్తంలో పేలుడు పదార్థాలు స్వాధీనం చేసుకోవడం ఇది రెండోసారి. శనివారం దోడ జిల్లాలోని చకరండిలో.. 40 కేజీల అత్యంత ప్రమాదకర పేలుడు పదార్థాలు, ఐఈడీ అమర్చిన కుక్కర్ సహా ఇతర వస్తువులను స్వాధీనం చేసుకున్నాయి భద్రతా దళాలు.
ఇదీ చదవండి:'కరోనా విలయానికి కొత్త రకాలే కారణం కాదు'