ETV Bharat / bharat

తృటిలో తప్పించుకున్న నక్సల్ అగ్రనేతలు!​

author img

By

Published : Jan 19, 2021, 7:28 PM IST

ఛత్తీస్​గఢ్​ దంతెవాడలో మావోయిస్టులు చిక్కినట్లే చిక్కి తప్పించుకున్నారు. అగ్రశ్రేణి నక్సల్స్​ సమావేశమయ్యారన్న పక్క సమాచారంతో భద్రతా దళాలు దాడికి దిగాయి. అప్రమత్తమైన మావోయిస్టులు అడవిలోకి పారిపోయారు.

Security forces attack top Naxal camp in Chhattisgarh
అగ్రశ్రేణి మావోలపై దాడికి యత్నం-దంతెవాడలో ఘటన

ఛత్తీస్​గఢ్​లోని నక్సల్స్​ క్యాంప్​పై భద్రతా దళాలు జరిపిన దాడిలో.. మావోయిస్టులు తృటిలో తప్పించుకున్నారని దంతెవాడ జిల్లా ఎస్పీ అభిషేక్​ పల్లవ తెలిపారు. అగ్రశ్రేణి నక్సల్​ నేతలు సమావేశమయ్యారన్న పక్క సమాచారంతో డీఆర్​జీ, ఎస్​టీఎఫ్​, రాష్ట్ర పోలీసు బలగాలు కాల్పులు జరిపాయని పేర్కొన్నారు.

అగ్రశ్రేణి మావోయిస్టులు చైతు, వినోద్​, దేవా ఛత్తీస్​గఢ్​లోని దర్భా డివిజన్​లో సమావేశమైనట్లు సమాచారం అందింది. భద్రతా బలగాలు సోమవారం సాయంత్రమే ఆ ప్రాంతాన్ని చుట్టుముట్టాయి. మా రాకను పసిగట్టిన నక్సల్స్​.. గాల్లోకి కాల్పులు జరుపుతూ అడవిలోకి పారిపోయారు.

-అభిషేక్​ పల్లవ, దంతెవాడ జిల్లా ఎస్పీ.

సంఘటన స్థలంలో 8-10 గుడారాలు, పేలుడు పదార్థాలు, ఏకే-47 రౌండ్లు, విప్లవ సాహిత్యం లభించినట్లు ఎస్పీ తెలిపారు. అక్కడ రక్తపు మరకలు ఉండటాన్ని బట్టి చూస్తే పలువురు నక్సల్స్​కు గాయాలైనట్లు తెలుస్తోందన్నారు.

ఇదీ చదవండి: ఒకే కుటుంబానికి చెందిన నలుగురు ఆత్మహత్య

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.