Security Along China, Pakistan: హెలికాప్టర్ ప్రమాద ఘటనలో త్రిదళాధిపతి బిపిన్ రావత్ మరణానంతరం తొలిసారిగా ఆర్మీ ఉన్నతాధికారులు భేటీ అయ్యారు. చైనా, పాకిస్థాన్ సరిహద్దుల్లో భద్రతా పరిస్థితులపై చర్చించారు. ఆర్మీ ఛీఫ్ మనోజ్ ముకుంద్ నరవాణే ఆధ్వర్యంలో రెండు రోజుల పాటు జరగనున్న ఈ చర్చలు.. దిల్లీ వేదికగా గురువారం ప్రారంభమయ్యాయి.
"చైనా, పాకిస్థాన్ సరిహద్దుల్లోని పరిస్థితులు, జమ్ము కశ్మీర్లో పరిస్థితిపై ఆర్మీ కమాండర్స్ చర్చ జరిపారు." అని ఓ ప్రభుత్వ అధికారి తెలిపారు.
తూర్పు లద్ధాఖ్‌లో గల్వాన్ హింసాత్మక ఘటన అనంతరం భారత్, చైనా సరిహద్దుల మధ్య ప్రతిష్టంభన నెలకొంది. గతేడాది ఏప్రిల్-మే సమయంలో ఇరు దేశాలు భారీ సంఖ్యలో సరిహద్దుల వద్దకు తమ సైన్యాన్ని మొహరించాయి. కొన్ని నెలల తర్వాత బలగాల ఉపసంహరణ దిశగా అడుగులేశాయి. ఈ నేపథ్యంలో ఆర్మీ కమాండర్స్.. చైనా దుందుడుకు చర్యలపై చర్చించారు.
సీడీఎస్ బిపిన్ రావత్ డిసెంబర్ 8న హెలికాప్టర్ క్రాష్‌లో మరణించారు. ఈ ఘటనలో ఆయన సతీమణి సహా మరో 12 మంది ప్రాణాలు కోల్పోయారు.
ఇదీ చదవండి:
యుద్ధవీరుడు, త్రిదళాధిపతి.. అసలెవరీ బిపిన్ రావత్?
Bipin Rawat last speech: బిపిన్ రావత్ చివరి సందేశం.. ఏం మాట్లాడారంటే..?