దేశీయంగా అభివృద్ధి చేసిన కొత్త తరం ఆకాశ్ క్షిపణిని(ఆకాశ్-ఎన్జీ) భారత్ విజయవంతంగా పరీక్షించింది. రెండు రోజుల వ్యవధిలో ఆకాశ్‌కు ఇది రెండో పరీక్ష కాగా ఈసారి ప్రతికూల వాతావరణంలో క్షిపణి నిర్దేశిత పనితీరు కనబరిచినట్లు రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ (డీఆర్డీఓ) పేర్కొంది. ఒడిశా బాలేశ్వర్‌లోని ఇంటిగ్రేడెట్ టెస్ట్ రేంజ్లో ఈ పరీక్షలు చేపట్టారు.
గగనతలంలో వేగంగా దూసుకెళ్తున్న మానవరహిత లోహ విహంగాన్ని ఆకాశ్ గురి తప్పకుండా ఛేదించిందని డీఆర్డీఓ తెలిపింది.
ఉపరితలం నుంచి గగనతలంలో 30 కిలోమీటర్ల పరిధిలో లక్ష్యాలను ఛేదించే సామర్థ్యం ఆకాశ్ సొంతం. నేటి పరీక్షలో లాంచర్, రాడర్, కమాండ్ అండ్ కంట్రోల్‌తో పాటు పూర్తి ఆయుధ వ్యవస్థ పనితీరును సమీక్షించినట్లు డీఆర్డీఓ వివరించింది.
ఇదీ చూడండి: 'యాంటీ ట్యాంక్ గైడెడ్ మిసైల్' ప్రయోగం విజయవంతం