ETV Bharat / bharat

బంగాల్​ దంగల్​: రెండో దశకు సంసిద్ధం - బంగాల్​ రెండో విడత ఎన్నికలు

బంగాల్ శాసనసభ ఎన్నికల రెండో విడత పోలింగ్​కు సర్వం సిద్ధమైంది. గురువారం 30 నియోజకవర్గాలకు ఓటింగ్ జరగనుంది. 171 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. మమతా బెనర్జీ-సువేందు అధికారి నువ్వానేనా అన్నట్లు తలపడిన నందిగ్రామ్​ తీర్పు సైతం గురువారం ఈవీఎంలలో నిక్షిప్తం కానుంది.

Second phase of Bengal elections to witness many key battles
బంగాల్​ దంగల్​: రెండో దశ ఎన్నికలకు సంసిద్ధం
author img

By

Published : Mar 31, 2021, 5:26 PM IST

Updated : Mar 31, 2021, 6:11 PM IST

బంగాల్ శాసనసభ ఎన్నికల రెండో విడత పోలింగ్​కు ఏర్పాట్లు పూర్తయ్యాయి. గురువారం 30 నియోజకవర్గాలకు ఓటింగ్ జరగనుంది. మొత్తం 171 మంది అభ్యర్థులు తమ అదృష్టాన్ని పరిక్షించుకుంటున్నారు.

గురువారం పోలింగ్ జరిగే నియోజకవర్గాల్లో నందిగ్రామ్​ సైతం ఉండగా.. తుది ఫలితంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఈ స్థానం నుంచి బంగాల్​ సీఎం మమతా బెనర్జీ, భాజపా నేత సువేందు అధికారి, మహా కూటమి (వామపక్షం-కాంగ్రెస్​-ఐఎస్​ఎఫ్) నుంచి సీపీఎం​ నేత మీనాక్షి ముఖర్జీ పోటీపడుతున్నారు.

ప్రముఖుల పోరు

పశ్చిమ మేదినీపుర్​లోని సబాంగ్​ నియోజకవర్గంలో తృణమూల్ అభ్యర్థి మనాస్​ రంజన్​ భునియా పోటీ చేస్తుండగా.. భాజపా నుంచి అమూల్య మైతీ, ఎస్​యూసీఐ(సీ) నుంచి హరేకృష్ణ మైతీ బరిలో ఉన్నారు.

Second phase of Bengal elections to witness many key battles
బంగాల్​ దంగల్​ 2021

కీలక నేతలు

అభ్యర్థుల ఏడీఆర్ రిపోర్టు

మహిళా అభ్యర్థులు

ఈవీఎంలను పోలింగ్​ కేంద్రాలకు తీసుకెళ్తున్న సిబ్బంది

పోలింగ్ కేంద్రం వద్ద సిబ్బంది

ఈవీఎంలను పోలింగ్ కేంద్రాలకు తరలిస్తున్న సిబ్బంది

ఖరగ్​పుర్ సదర్ నియోజకవర్గంలో భాజపా నుంచి హిరన్​మోయి ఛటోపాధ్యాయ, తృణమూల్ నుంచి ప్రదీప్ సర్కార్ పోటీ చేస్తున్నారు.

బంగాల్​ రెండో విడత ఎన్నికల్లో కొంతమంది సినీ తారలు సైతం తమ అదృష్టాన్ని పరిక్షించుకుంటున్నారు. చండీపుర్ నుంచి సయంతిక బెనర్జీ, బంకురా నుంచి సోహం చక్రవర్తి పోటీలో ఉన్నారు.

పటిష్ఠ భద్రత

రెండో దశ ఎన్నికలు జరుగుతున్న దక్షిణ 24 పరగణాలు, పశ్చిమ మేదినీపుర్, బంకురా, తూర్పు మేదినీపుర్​ జిల్లాల్లో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పటిష్ఠ భద్రతను ఏర్పాటు చేశారు అధికారులు. నందిగ్రామ్​ నియోజకవర్గం ఉన్న పూర్వ మేదినీపుర్​ జిల్లాలో 144 సెక్షన్​ విధించారు. ఒక్క నందిగ్రామ్​ నియోజకవర్గంలోనే 22 కంపెనీల కేంద్ర బలగాలను మోహరించారు.

ఇదీ చదవండి : 'బంగాలీ ఆత్మగౌరవం' దీదీని గెలిపించేనా?

బంగాల్​ దంగల్​: గాయాలే దీదీ విజయానికి సోపానాలు!

బంగాల్​ దంగల్​: రాజకీయ సిద్ధాంతాల్ని మరచిన నేతలు!

కౌన్‌ బనేగా బంగాల్​ టైగర్‌?

దీదీ అస్తిత్వ పోరు- టీఎంసీకి 'చావో-రేవో'!

Last Updated : Mar 31, 2021, 6:11 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.