కాలం చెల్లిన బస్సులను పునరుద్ధరించి మహిళా మొబైల్ టాయిలెట్లుగా మార్చాలని ఈశాన్య కర్ణాటక ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్(ఎన్ఎస్డబ్ల్యూఆర్టీసీ) నిర్ణయించింది. ఎన్ఎస్డబ్ల్యూఆర్టీసీ ప్రాంతీయ కార్యాలయం నుంచి తుది అనుమతి లభించగానే.. ఈ టాయిలెట్ బస్సులు బహిరంగ వినియోగానికి రానున్నాయి.
ఎలా చేశారంటే?
బయటివైపు ఆకుపచ్చ, గులాబీ రంగులతో కూడిన ఈ బస్సు లోపలి భాగంలో.. రెండు భారతీయ సంప్రదాయ మరగుదొడ్లతో సహా మొత్తం నాలుగు టాయిలెట్లను ఏర్పాటుచేశారు. అంతే కాకుండా రెండు వాష్ బేసిన్లు, ఓ అద్దం అమర్చారు. బస్సు వెనకాల వైపు.. పిల్లల సంరక్షణకు, విశ్రాంతి తీసుకునేందుకు వేరు వేరు గదులను రూపొందించారు. ఒక్క డ్రైవర్ సీటు మినహా.. మిగిలినవన్నీ తొలగించేసి భారీ మార్పులు చేశారు. డ్రైవర్ సీటు పక్కన ఓ నీటి ట్యాంకు ఉంచారు. విద్యుత్ సరఫరా కోసం యూపీఎస్ బ్యాటరీ, 4 మరుగుదొడ్లలో విడిగా ఎగ్జాస్ట్ ఫ్యాన్లను అమర్చారు.
ఇదీ చదవండి:కంటైనర్లో మంటలు- ఇద్దరు సజీవ దహనం
ఉత్సవాల కోసం..
రాష్ట్రంలో ఏవైనా ఉత్సవాలు నిర్వహించినప్పుడు సుదూర ప్రాంతాల నుంచి వచ్చే మహిళలను దృష్టిలో ఉంచుకుని వారికి ఇబ్బంది కలగకుండా ఉండేందుకు వీటిని తయారు చేసినట్టు ఎన్ఎస్డబ్ల్యూఆర్టీసీ ఛైర్మన్ వీఎస్ పాటిల్ తెలిపారు. ముఖ్యంగా.. పసిపిల్లలకు పాలిచ్చే తల్లులను దృష్టిలో ఉంచుకుని వీటిని రూపొందించామన్నారు. ఇవి వాడకంలోకి వచ్చాక వినియోగదారుల ప్రతిస్పందనను బట్టి.. రానున్న కాలంలో మరిన్ని బస్సులను మొబైల్ టాయిలెట్లుగా మార్చేందుకు యోచిస్తామని ఆయన చెప్పారు.
ఇదీ చదవండి: ఓఎల్ఎక్స్లో రెమ్‌డెసివిర్ ఇంజెక్షన్లు