ETV Bharat / bharat

Railway Jobs Notification : రైల్వేలో ఉద్యోగాలకు నోటిఫికేషన్​.. అప్లై చేసుకోండిలా..

SCR Recruitment 2023 : దక్షిణ మధ్య రైల్వే 'జూనియర్​ టెక్నికల్​ అసోసియేట్​​' పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్​ విడుదల చేసింది. ఈ రిక్రూట్​మెంట్​ ద్వారా మొత్తం 35 ఖాళీలు భర్తీ చేయనున్నారు. విద్యార్హతలు, వయోపరిమితి, ఫీజు, పరీక్ష విధానం తదితర పూర్తి వివరాలు మీ కోసం.

South Central Railway notification 2023
SCR Recruitment 2023
author img

By

Published : Jun 20, 2023, 11:00 AM IST

SCR Recruitment 2023 : రైల్వే​లో పనిచేయాలనే ఆస్తకి ఉన్న అభ్యర్థులకు గుడ్​ న్యూస్​. దక్షిణ మధ్య రైల్వే 35 జూనియర్​ టెక్నికల్​ అసోసియేట్​ పోస్టుల భర్తీ కోసం ప్రకటన విడుదల చేసింది. దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ 2023 జూన్ 30.

పోస్టుల వివరాలు

  1. సివిల్​ ఇంజినీరింగ్​ డిపార్ట్​మెంట్​లో.. జూనియర్​ టెక్నికల్​ అసోసియేట్​ (వర్క్స్​) - 19 పోస్టులు
  2. ఎలక్ట్రికల్​ ఇంజినీరింగ్​ డిపార్ట్​మెంట్​లో.. జూనియర్​ టెక్నికల్ అసోసియేట్​ (డ్రాయింగ్​) - 10 పోస్టులు
  3. ఎస్​ అండ్​ టీ డిపార్ట్​మెంట్​లో.. జూనియర్​ టెక్నికల్​ అసోసియేట్​ (డ్రాయింగ్​) - 06 పోస్టులు

విద్యార్హతలు

  • Railway Jobs Notification 2023 : జూనియర్​ టెక్నికల్​ అసోసియేట్​ (వర్క్స్​) - అభ్యర్థులు గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి 4 సంవత్సరాల వ్యవధి గల సివిల్​ ఇంజినీరింగ్​ లేదా సివిల్​ ఇంజినీరింగ్​కు సంబంధించిన సబ్​స్ట్రీమ్స్​ కాంబినేషన్స్​లో బ్యాచిలర్​ డిగ్రీ చేసి ఉండాలి.
  • జూనియర్​ టెక్నికల్ అసోసియేట్​ (ఎలక్ట్రికల్​) (డ్రాయింగ్​) - అభ్యర్థులు గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి నాలుగేళ్ల వ్యవధి గల మెకానికల్​/ ఎలక్ట్రికల్​/ ఎలక్ట్రానిక్స్​లో బ్యాచిలర్​ డిగ్రీ చేసి ఉండాలి. లేదా గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి 3 ఏళ్ల వ్యవధి గల మెకానికల్​, ఎలక్ట్రికల్​, ఎలక్ట్రానిక్స్​లో డిప్లొమా చేసి ఉండాలి.
  • జూనియర్​ టెక్నికల్ అసోసియేట్​ ఎస్ & టీ (డ్రాయింగ్​) - అభ్యర్థులు గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి ఎలక్ట్రికల్​/ ఎలక్ట్రానిక్స్​/ ఇన్ఫర్మేషన్​ టెక్నాలజీ/ కమ్యునికేషన్​ ఇంజినీరింగ్​/ కంప్యూటర్​ సైన్స్​ & ఇంజినీరింగ్​ లేదా ఎమ్మెస్సీ ఎలక్ట్రానిక్స్​లో నాలుగేళ్ల బ్యాచిలర్​ డిగ్రీ ఉత్తీర్ణత పొంది ఉండాలి. లేదా అభ్యర్థులు గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి ఎలక్ట్రికల్​/ ఎలక్ట్రానిక్స్​/ ఇన్ఫర్మేషన్​ టెక్నాలజీ/ కమ్యునికేషన్​ ఇంజినీరింగ్​/ కంప్యూటర్​ సైన్స్​ & ఇంజినీరింగ్​ లేదా ఎమ్మెస్సీ ఎలక్ట్రానిక్స్​లో మూడేళ్లు వ్యవధి గల డిప్లొమా పూర్తి చేసి ఉండాలి.

వయోపరిమితి

  • యూఆర్​ - 18 నుంచి 33 ఏళ్లు
  • ఓబీసీ - 18 నుంచి 36 ఏళ్లు
  • ఎస్సీ/ ఎస్టీ - 18 నుంచి 38 ఏళ్లు

దరఖాస్తు రుసుము
ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, మహిళలు, మైనారిటీలు, ఈడబ్ల్యూఎస్​ అభ్యర్థులు రూ.250 దరఖాస్తు రుసుముగా చెల్లించాలి. మిగతా కేటగిరీ అభ్యర్థులు రూ.500 చెల్లించాల్సి ఉంటుంది.

ఎంపిక ప్రక్రియ
విద్యార్హతకు 55 మార్కులు, అనుభవానికి 30 మార్కులు, పర్సనాలిటీ లేదా ఇంటెలిజెన్స్​కు 15 మార్కులు కేటాయిస్తారు. వీటిలో మెరిట్​ సాధించిన అభ్యర్థులను ఉద్యోగాలకు ఎంపిక చేస్తారు.

ఆఫ్​లైన్​లో దరఖాస్తు ఇలా?
ఆసక్తి గల అభ్యర్థులు తమ దరఖాస్తును ఆఫ్​లైన్​లో పంపించాల్సి ఉంటుంది. అప్లికేషన్​ పంపించాల్సిన చిరునామా : సెక్రటరీ టూ ప్రిన్సిపల్ చీఫ్​ పర్సనల్​ ఆఫీసర్ అండ్​ సీనియర్ పర్సనల్​ ఆఫీసర్​ (ఇంజినీరింగ్​), ఆఫీస్​ ఆఫ్​ ప్రిన్సిపల్​ చీఫ్​ పర్సనల్​ ఆఫీసర్​, ఫోర్త్​ ఫ్లోర్​, పర్సనల్​ డిపార్ట్​మెంట్​, రైల్వే నిలయం, సౌత్​ సెంట్రల్​ రైల్వే, సికింద్రాబాద్​, పిన్​ 500025

దరఖాస్తుకు చివరి తేదీ
దరఖాస్తు ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైంది. అప్లై చేసుకోవడానికి ఆఖరు తేదీ 2023 జూన్​ 30.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.