ETV Bharat / bharat

పెళ్లింట విషాదం.. వధువు కుటుంబంపైకి దూసుకెళ్లిన స్కార్పియో.. ముగ్గురు మృతి

పెళ్లి జరగాల్సిన ఇంట్లో విషాదం నెలకొంది. వరుడి కుటుంబం కోసం వేచి చూస్తున్న వధువు తరపువారికి ప్రమాదం జరిగింది. వేగంగా వచ్చిన ఓ స్కార్పియో వాహనం వీరిపైకి దూసుకెళ్లింది. ఘటలో ముగ్గురు మృతి చెందారు. మరి కొందరు తీవ్రంగా గాయపడ్డారు.

scorpio-ramp-over-bride-family-in-odissa
వధువు కుటుంబంపై దూసుకెళ్లిన స్కార్పియో
author img

By

Published : Feb 15, 2023, 1:18 PM IST

పెళ్లి ఇంట్లో విషాదం జరిగింది. వరుడికి స్వాగతం పలికేందుకు రహదారి పక్కన వేచి ఉన్న.. వధువు కుటుంబ సభ్యులపైకి ఓ వాహనం దూసుకెళ్లింది. ఈ ఘటనలో ఇద్దరు మహిళలతో సహా 12 ఏళ్ల చిన్నారి అక్కడికక్కడే మృతి చెందారు. మరికొందరు తీవ్రంగా గాయపడ్డారు. ఒడిశాలో ఈ ఘటన జరిగింది. దీంతో ఆనందంగా పెళ్లి జరగాల్సిన ఇంట్లో విషాద ఛాయలు అలుముకున్నాయి.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గంజాం జిల్లాలో ఈ ఘటన జరిగింది. మృతులను స్వప్న రెడ్డి(22), సంజు రెడ్డి(23), భారతి రెడ్డి(12)గా పోలీసులు గుర్తించారు. గోపాల్‌పుర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని మాండియాపల్లి వద్ద ప్రమాదం జరిగిందని వెల్లడించారు. వీరంతా కేశవ్ నగర్​కు చెందిన వారని తెలిపారు. ఘటనలో మరో 12 మంది తీవ్రంగా గాయపడ్డారు. ప్రస్తుతం గాయపడ్డ వారంతా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని వివరించారు. అందులో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉందని పోలీసులు చెప్పారు.

ఎలా జరిగిందంటే..?
దాదాపు 30 మంది వధువు తరపు బంధువులు.. వరుడి కుటుంబానికి స్వాగతం పలికేందుకు ఓ బ్రిడ్జ్​పై వేచిచూస్తున్నారు. ఆ సమయంలోనే అక్కడికి వేగంగా వచ్చిన ఓ స్కార్పియో వాహనం వీరిపైకి దూసుకెళ్లింది. ప్రమాద సమయంలో వాహన డ్రైవర్ మద్యం​ మత్తులో ఉన్నట్లు తెలుస్తోంది. ప్రమాదంపై సమాచారం అందుకున్న పోలీసులు.. వెంటనే అక్కడికి చేరుకున్నారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్నారు. ప్రమాదంపై పూర్తి స్థాయిలో విచారణ జరుపుతున్నట్లు తెలిపారు. పెళ్లి జరగాల్సిన ఇంట్లో అనుకోని విషాదం కారణంగా.. ఇరువురి కుటుంబాలు కన్నీరుమున్నీరవుతున్నాయి.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.