ETV Bharat / bharat

ఐదు కోట్ల ఏళ్ల నాటి చీమలు!.. అరుదైన ఘనత సాధించిన భారత శాస్త్రవేత్తలు

శ్రీనగర్​ శాస్త్రవేత్తలు ఓ అరుదై ఘనత సాధించారు. ఐదు కోట్ల ఇరవై లక్షల సంవత్సరాల క్రితం నాటి చీమల శిలాజాన్ని కనుగొన్నారు. లార్వా రూపంలో వీటిని గుర్తించారు. ఇలాంటి శిలాజాన్ని కనుగొనడం ప్రపంచంలోనే ఇది మొదటి సారని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

scientists-of-garhwal-university-discovered-50-million-years-old-fossil-of-ant
50 మిలియన్ సంవత్సరాల చీమల శిలాజం
author img

By

Published : Feb 25, 2023, 10:07 PM IST

ఐదు కోట్ల ఇరవై లక్షల సంవత్సరాల క్రితం నాటి చీమల శిలాజాన్ని కనుగొన్నారు శాస్త్రవేత్తలు. జమ్ము కశ్మీర్​లోని శ్రీనగర్​లో ఉన్న హేమవతి నందన్ గడ్​వాల్ సెంట్రల్ యూనివర్సిటీకి చెందిన శాస్త్రవేత్తలు ఈ ఘనతను సాధించారు. రాజస్థాన్​లోని బీకానెర్​ ప్రాంతలోని ఓ గనిలో వీటిని గుర్తించిట్లు శాస్త్రవేత్తలు తెలిపారు. లార్వా రూపంలో ఈ శిలాజం లభించిందని శాస్త్రవేత్తలు తెలిపారు. లార్వా రూపంలో ఉన్న చీమల శిలాజాన్ని కనుగొనడం ప్రపంచంలోనే మొదటిసారని వారు చెబుతున్నారు. ఇది అత్యంత పూరాతనమైన లార్వా అని శాస్త్రవేత్తలు అంటున్నారు. ప్రస్తుతం ఈ చీమల శిలాజంపై మరింత లోతుగా పరిశోధనలు జరుపుతున్నట్లు వారు వెల్లడించారు. భవిష్యత్తులో మరిన్ని విషయాలు తెలుసుకునేందుకు.. ఈ శిలాజం దోహదం చేస్తుందని శాస్త్రవేత్తలు అభిప్రాయపడుతున్నారు.

"యూనివర్సిటీ ప్రొఫెసర్​ డాక్టర్​ రాజేంద్ర రాణా అధ్వర్యంలో ఈ పరిశోధన జరుగుతోంది. బీకానెర్​లోని బ్రౌన్​ మైన్స్​​లో ఈ చీమల లార్వాను శాస్త్రవేత్తలు గుర్తించారు. ఇందుకోసం రష్యా శాస్త్రవేత్తల సహాయం సైతం తీసుకున్నారు. 2ఎమ్​ఎమ్​ పరిణామంలో ఈ లార్వా ఉంది. ఒక లార్వాను నీటిలో గుర్తించారు. ఇంతకు ముందెన్నడు నీటిలో ఓ శిలాజాన్ని గుర్తించలేదు" అని గడ్​వాల్ యూనివర్సిటీలోని పీఎచ్​డీ స్కాలర్​ రమణ పటేల్​ తెలిపారు.

ఈ శిలాజం జర్మనీ, మయన్మార్​లో ఇంతకుముందు కూడా కనుగొన్నారని.. కానీ లార్వా రూపంలో కనుగొన్న శిలాజం మాత్రం ప్రత్యేకమైనదని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఇది లార్వా పరిణామ క్రమాన్ని కనుగొనేందుకు దోహదపడుతుందని వారు తెలిపారు. ప్రస్తుతం రెండు జాతులు మాత్రమే ఇప్పుడు భూమ్మీద నివాసం ఉంటున్నాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

scientists-of-garhwal-university-discovered-50-million-years-old-fossil-of-ant
50 మిలియన్ సంవత్సరాల చీమల శిలాజం
scientists-of-garhwal-university-discovered-50-million-years-old-fossil-of-ant
శిలాజలం లార్వా నమూనా పటం

"శిలాజలం 2ఎమ్​ఎమ్​ సైజులో ఉంది. లార్వా అభివృద్ధి చెందే క్రమాన్ని అర్థం చేసుకునేందుకు ఈ శిలాజం సహాయకరంగా ఉంటుంది. ఇతర శిలాజాలకు ఇప్పుడు గుర్తించిన లార్వాకు పెద్దగా తేడా ఏమిలేదు. కానీ కాళ్ల నిర్మాణంలో కొంచెం తేడా ఉంది. ఇదే చాలా ఆసక్తికరంగా ఉంది" అని యూనివర్సిటీ సీనియర్ సైంటిస్ట్ ప్రొఫెసర్ రాజేంద్ర రాణా తెలిపారు.

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.