ETV Bharat / bharat

తొలగిన ఆంక్షలు.. విద్యార్థుల బడిబాట

కొవిడ్‌ ఆంక్షలతో మూతపడిన పాఠశాలలు కొన్ని రాష్ట్రాలు తిరిగి ప్రారంభమయ్యాయి. ప్రభుత్వాలు కొవిడ్ నిబంధనల మేరకు అనుమతివ్వగా.. పంజాబ్‌, ఉత్తరాఖండ్‌, ఛత్తీస్‌గఢ్​లో విద్యార్థులు బడిబాట పట్టారు. ఝార్ఖండ్‌లో పాఠశాలలు తెరుచుకున్నప్పటికీ వారం తర్వాతే విద్యార్థులను అనుమతించనున్నారు. ఆన్‌లైన్ కంటే ప్రత్యక్ష తరగతులే మేలని బడులకు వెళ్లిన విద్యార్థులు, వారి తల్లిదండ్రులు చెబుతున్నారు.

Schools reopen in various states
పాఠశాలల పునఃప్రారంభం
author img

By

Published : Aug 2, 2021, 1:04 PM IST

Updated : Aug 2, 2021, 1:17 PM IST

విద్యార్థుల బడిబాట

కొవిడ్‌ ఆంక్షల నుంచి సడలింపులు ఇవ్వడంతో ఛత్తీస్​గఢ్​లో పాఠశాలలు ఏడాది తర్వాత ప్రారంభమయ్యాయి. కొవిడ్ పాజిటివిటీ రేటు గత వారం రోజులుగా ఒక శాతం ఉన్న జిల్లాల్లో మాత్రమే పాఠశాలలను తెరిచేందుకు ప్రభుత్వం అనుమతించింది. ప్రభుత్వం 50శాతం హాజరు షరతు విధించగా పాఠశాలల యాజమాన్యాలు ఆ మేరకు ఏర్పాట్లు చేశాయి. ఛత్తీస్​గఢ్​లో దాదాపు ఏడాది తర్వాత పది, 12 తరగతుల విద్యార్థులు ప్రత్యక్ష తరగతులకు హాజరయ్యారు. పంజాబ్‌లోనూ పాఠశాలలు తెరుచుకున్నాయి. విద్యార్థుల మధ్య భౌతిక దూరం కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. తల్లిదండ్రుల సమ్మతి మేరకే విద్యార్థులను తరగతులకు అనుమతించారు. పంజాబ్ విద్యార్థులు బడులు తెరవడంపై హర్షం వ్యక్తం చేశారు.

school reopen in punjab
పంజాబ్​లో పిల్లల్ని పాఠశాలకు తీసుకువస్తున్న తల్లిదండ్రులు
Schools reopen in chhattisgarh
బడికి వచ్చి విద్యార్థుల టెంపరేచర్​ పరీక్షిస్తున్న సిబ్బంది
school reopen in punjab
పంజాబ్​లో చిన్నారిని పాఠశాలకు తీసుకువస్తున్న తండ్రి

కరోనా మహమ్మారి వల్ల పాఠశాల మూసివేసి ఏడాది అయింది. పాఠశాల తెరవడం చాలా మంచి విషయం. పిల్లలు చదువుకోవచ్చు. పాఠాలు అర్థం చేసుకోవచ్చు. ఆడుకోవచ్చు. పిల్లలందరికీ సంతోషంగా ఉంది.

-మౌనీష్‌, విద్యార్థి, లూథియానా, పంజాబ్‌

మా అంగీకారంతోనే పాఠశాలకు వచ్చాం. ఇంటర్నెట్ సమస్య వల్ల ఆన్‌లైన్‌ క్లాస్‌లు నిలిచిపోయేవి. పూర్తిగా అర్థమయ్యేవి కాదు. ఇక్కడ అర్థంకాకపోతే మేడమ్‌ను అడగవచ్చు. స్కూల్‌తో పోల్చితే ఆన్‌లైన్ చాలా ఇబ్బందిగా ఉంటోంది. శానిటైజర్ వెంట తెచ్చుకుంటున్నాం. భౌతికదూరం పాటిస్తున్నాం. మాస్క్‌ వేసుకుంటున్నాం. వ్యాక్సిన్‌ వస్తే వేయించుకుంటాం.

-మన్షీరా కౌర్‌, విద్యార్థిని, అమృత్‌సర్- పంజాబ్‌

ఉత్తరాఖండ్‌లోనూ 9 నుంచి 12 తరగతి వరకు పాఠశాలలను తెరిచారు. కొవిడ్ నిబంధనలు పాటిస్తూ బడుల్లో శానిటైజేషన్ సహా అన్ని ఏర్పాట్లు చేశారు. నేరుగా అయితే పాఠాలు అర్థం చేసుకోవచ్చని, బాగా చదువుకోవచ్చని విద్యార్థులు, వారి తల్లిదండ్రులు చెబుతున్నారు.

school reopen uttarakhand
ఉత్తరాఖండ్​లో తరగతులకు హాజరైన విద్యార్థులు
school reopen uttarakhand
ఉత్తరాఖండ్​లో పాఠశాలకు వస్తున్న విద్యార్థులు
school reopen uttarakhand
ఉత్తరాఖండ్​లో భౌతికదూరం పాటిస్తు తరగతుల నిర్వహణ

ఇన్ని రోజుల తర్వాత పాఠశాలకు రావడం మాకు చాలా ఆనందంగా ఉంది. ఇక్కడ మా కాన్సెప్ట్‌లు అర్థం చేసుకోవచ్చు. పాఠశాల తెరవడం చాలా మంచి విషయం. స్కూల్‌కు వెళ్లేందుకు మా తల్లిదండ్రులు కూడా అంగీకరించారు. మేము కూడా వచ్చేందుకు సమ్మతించాం. ముందు చాలా భయం ఉండేది. ఇప్పుడూ కూడా కొంత భయం ఉంది.

-నీరజ్ కుమారి, విద్యార్థిని

మనసులో ఆందోళన ఉన్నప్పటికీ పిల్లలకు చదువు చాలా ముఖ్యం కదా. ఆన్‌లైన్ క్లాసుల్లో పిల్లలు చదువు మానేసి ఆడుకోవడం, టీవీ చూడడం చేస్తున్నారు. చదవడం లేదు. పాఠశాలలో చదువుకున్నట్లు ఇంటిలో చదువుకోవడం లేదు.

-సీతా సీమవాల్‌, విద్యార్థుల తల్లి

పాఠశాల మూతపడినప్పటి నుంచి పిల్లలు ఖాళీగా కూర్చోవడం, మొబైల్​లో సినిమా చూడడం చేస్తూ చదువు పూర్తిగా మానేశారు. పాఠశాల తెరవడం వల్ల మళ్లీ చదువుపై శ్రద్ధపెడతారు. చదువుతారు. పరీక్షలు పెడతారు. వాటిలో పాస్ అయితే బాగుంటుంది. లేకుంటే మామూలుగా పాస్ చేస్తున్నారు. నాకైతే మనసులో ఎలాంటి భయం లేదు. కరోనా విషయంలో పిల్లలు వారి జాగ్రత్తలు వారు తీసుకుంటున్నారు.

-రాజేంద్ర కుమార్, విద్యార్థి తండ్రి

ఝార్ఖండ్‌లో పాఠశాలలు తెరుచుకున్నప్పటికీ తొలి వారం రోజులు ఉపాధ్యాయులు మాత్రమే హాజరుకావాలని ప్రభుత్వ స్పష్టంచేసింది. వారం తర్వాత కొవిడ్‌ పరిస్థితులను బట్టి విద్యార్థులను కూడా అనుమతించాలని ఝూర్ఖండ్ సర్కార్ నిర్ణయించింది.

Schools reopen in chhattisgarh
ఛత్తీస్‌గఢ్​లో పాఠశాలకు వస్తున్న విద్యార్థులు
Schools reopen in chhattisgarh
ఛత్తీస్‌గఢ్​లో తరగతులకు హాజరైన విద్యార్థులు

ఇదీ చూడండి: అక్కడ రాళ్లు రువ్వితే ఉద్యోగమివ్వరు!

Last Updated : Aug 2, 2021, 1:17 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.