ETV Bharat / bharat

స్కూల్​ బస్సులో మంటలు.. లక్కీగా పిల్లలంతా...

School bus fire: రహదారిపై పాఠశాల బస్సులో ఆకస్మికంగా మంటలు చెలరేగిన సంఘటన మహారాష్ట్రలోని నవీ ముంబయిలో సోమవారం మధ్యాహ్నం జరిగింది. బస్సులో 16 మంది విద్యార్థులు ఉన్నారు. డ్రైవర్​ చాకచక్యంగా వ్యవహరించటం వల్ల త్రుటిలో పెను ప్రమాదం తప్పింది. మరో ఘటనలో తేనెటీగల నుంచి తప్పించుకోబోయిన ఓ బాలుడు లోయలో పడి మృతి చెందాడు.

author img

By

Published : Apr 25, 2022, 5:27 PM IST

School bus fire
స్కూల్​ బస్సులో చెలరేగిన మంటలు

School bus fire: విద్యార్థులతో వెళ్తున్న ఓ పాఠశాల​ బస్సులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. బస్సులోని 16 మంది విద్యార్థులు, డ్రైవర్​, క్లీనర్​ త్రుటిలో ప్రమాదం నుంచి తప్పించుకున్నారు. ఈ సంఘటన మహారాష్ట్రలోని నవీ ముంబయిలో సోమవారం మధ్యాహ్నం 1.30 గంటల ప్రాంతంలో జరిగింది.

ఐరోలీ ప్రాంతంలోని ఓ పాఠశాలకు చెందిన బస్సు 16 మంది విద్యార్థులతో వెళ్తుండగా ఠాణె వెస్ట్​లోని సిగ్నల్​ స్కూల్​ సమీపంలో ముంబయి- నాశిక్​ రోడ్డులో ఒక్కసారిగా మంటలు చెలరేగినట్లు ప్రాంతీయ విపత్తు నిర్వహణ విభాగం చీఫ్​ అవినాశ్​ సావంత్​ తెలిపారు. మంటలను గమనించిన డ్రైవర్​ చాకచక్యంగా వ్యవహరించి విద్యార్థులను బస్సులోంచి దింపేయటం వల్ల ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదని పేర్కొన్నారు. స్థానిక అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపుచేసినట్లు చెప్పారు.

లోయలోపడి బాలుడు మృతి: తేనెటీగల గుంపు నుంచి తప్పించుకునే క్రమంలో కాలుజారి లోయలో పడిపోయిన ఓ బాలుడు అక్కడికక్కడే ప్రాణాలొదిలాడు. ఈ సంఘటన మహారాష్ట్ర, సతారా తాలుకాలోని శివాజీనగర్​లో జరిగింది. తేనెటీగల దాడిలో మరో 8 మంది తీవ్రంగా గాయపడి ఆసుపత్రి పాలయ్యారు.

శివాజీనగర్​ హిల్​ నుంచి గ్రామ దేవతను ఊరేగింపుగా తీసుకొస్తున్న క్రమంలో తేనెటీగలు దాడి చేశాయి. వాటి నుంచి తప్పించుకునేందుకు సమీపంలోని కొండపైకి ఎక్కేందుకు ప్రయత్నించారు ఊరేగింపులో పాల్గొన్నవారు. సోమేశ్వర్​ అనే బాలుడు కాలు జారీ సమీపంలోని లోయలో పడిపోయాడు. ట్రెక్కర్​ శివేంద్ర రాజే భోస్లే, గ్రామస్థులు బాలుడి పడిపోయిన చోటుకు చేరుకోగా.. అప్పటికే ప్రాణాలు కోల్పోయినట్లు తెలిసింది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

Teen falls to death
కొండపైకి మెట్లు

ఇదీ చూడండి: రెండురోజుల క్రితం గృహప్రవేశం.. దంపతులు సజీవ దహనం.. పాపం కుమార్తె...

11 కేజీల గోల్డ్ బిస్కెట్లు సీజ్​.. కార్​లో సీక్రెట్ చాంబర్స్.. ఓపెన్ చేస్తే రూ.కోటి!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.