ETV Bharat / bharat

కావాలని కేసు సాగదీత- కానిస్టేబుల్​కు రూ.లక్ష జరిమానా - సుప్రీం కోర్టులో పోలీసుల కానిస్టేబుల్​ కేసు

భార్య హత్య కేసులో విచారణ జరగకుండా ఏళ్ల తరబడి కావాలని సాగదీస్తూ వస్తున్న ఉత్తరాఖండ్‌కు చెందిన ఓ పోలీస్‌ కానిస్టేబుల్‌కు సుప్రీంకోర్టు రూ.లక్ష జరిమానా విధించింది. న్యాయ ప్రక్రియను దుర్వినియోగం చేస్తూ.. 14 ఏళ్లుగా సాగదీస్తుండటంపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్‌.వి.రమణ ధర్మాసనం ఆగ్రహం వ్యక్తంచేసింది.

Supreme court
జస్టిస్​ ఎన్​వీ రమణ
author img

By

Published : Aug 10, 2021, 7:45 AM IST

కేసు విచారణ జరగకుండా ఏళ్ల తరబడి కావాలని సాగదీస్తూ వచ్చిన ఉత్తరాఖండ్‌కు చెందిన ఓ పోలీస్‌ కానిస్టేబుల్‌కు సుప్రీంకోర్టు సోమవారం రూ.లక్ష జరిమానా విధించింది. భార్యను హత్య చేసిన కేసులో నిందితుడిగా ఉన్న పూరన్‌ చంద్ర అనే ఆ పోలీసు న్యాయ ప్రక్రియను దుర్వినియోగం చేస్తూ ఆ కేసు విచారణను 14 ఏళ్లుగా సాగదీస్తుండటంపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్‌.వి.రమణ, జస్టిస్‌ వినీత్‌ శరణ్‌, జస్టిస్‌ సూర్యకాంత్‌లతో కూడిన ధర్మాసనం ఆగ్రహం వ్యక్తంచేసింది.

"భార్యను హత్య చేసిన కేసులో నిందితుడిగా ఉన్న మీరు దాని విచారణను 14 ఏళ్లపాటు విజయవంతంగా లాగారు. రెండు సార్లు సుప్రీంకోర్టుకు వచ్చారు. ఇది దారుణమైన కేసు, వ్యవస్థను దుర్వినియోగం చేయడమే" అని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ రమణ ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు. భార్య హత్య కేసులో మరోసారి తన స్టేట్‌మెంట్‌ రికార్డు చేయడానికి, ట్రయల్‌ కోర్టు ఇచ్చిన ఆదేశాలను కొట్టేయడానికి నిరాకరిస్తూ తొలుత ఉత్తరాఖండ్‌ హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. దానిని సవాలు చేస్తూ ఆయన సుప్రీంకోర్టులో స్పెషల్‌లీవ్‌ పిటిషన్‌ దాఖలు చేశారు. ఈ కేసు జస్టిస్‌ రమణ ఆధ్వర్యంలోని ధర్మాసనం ముందుకు విచారణకు వచ్చింది.

నిందితుడిగా ఉన్న వ్యక్తి పోలీసు కానిస్టేబుల్‌ అన్న విషయాన్ని ప్రతివాది తరఫు న్యాయవాదులు చెప్పడంతో జస్టిస్‌ రమణ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. "ఉద్యోగం నుంచి నిన్ను వెంటనే తొలగించి, నిమిషం కూడా ఆలస్యం చేయకుండా నేరుగా జైలుకు పంపాలి" అని వ్యాఖ్యానించారు. సీఆర్‌పీసీ సెక్షన్‌ 313 కింద 2013లో ఇప్పటికే ఒకసారి నమోదు చేసిన స్టేట్‌మెంట్‌ను మరోసారి రికార్డు చేయాలని కోరుతూ 2021లో పిటిషన్‌ దాఖలు చేయడాన్ని కోర్టు గుర్తించింది. అందుకు అతని తరఫు న్యాయవాది స్పందిస్తూ పిటిషనర్‌కు కొత్త పత్రాలు దొరికాయని చెప్పారు. జస్టిస్‌ సూర్యకాంత్‌ జోక్యం చేసుకుంటూ "అయిదేళ్ల తర్వాత మీకు మరో కొత్త విషయం గుర్తుకొస్తుంది. అప్పుడు కూడా మళ్లీ స్టేట్‌మెంట్‌ రికార్డు చేయాలా?"అని ప్రశ్నించారు.

రూ.లక్ష జరిమానా

న్యాయ ప్రక్రియను దుర్వినియోగం చేస్తున్నందుకు అతనికి జస్టిస్‌ రమణ రూ.లక్ష జరిమానా విధించారు. ఆ సొమ్మును బాధితురాలి తల్లికి చెల్లించాలని ఆదేశించారు. ఒకవేళ దీనిని చెల్లించకుంటే ఆస్తులు జప్తు చేయాలని కూడా సూచించారు. ఈ కేసుపై మూడు నెలల్లో నిర్ణయం వెలువరించాలని ట్రయల్‌ కోర్టును ఆదేశించారు. వరకట్నం తేవాలంటూ భార్యను వేధించి, హత్య చేశాడంటూ 2007లో ఆయనపై కేసు నమోదయింది. 2008 నుంచి సెషన్స్‌ కోర్టులో విచారణ జరుగుతోంది. ఇది కొనసాగకుండా కోర్టుల్లో రకరకాల విజ్ఞప్తులు చేస్తూ వస్తున్నారు.

ఇదీ చూడండి: సముద్రాల భద్రతకు మోదీ 'పంచ సూత్రాలు'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.