స్థిరాస్తి రంగాన్ని నియంత్రించేందుకు బంగాల్ ప్రభుత్వం తీసుకొచ్చిన చట్టాన్ని సుప్రీంకోర్టు కొట్టివేసింది. పార్లమెంటు పరిధిలో ఉన్న అంశాల్లోకి రాష్ట్ర ప్రభుత్వం ఆ చట్టం ద్వారా చొరబడిందని పేర్కొంది. అందుకే అది రాజ్యాంగ విరుద్ధమని పేర్కొంది.
బంగాల్ ప్రభుత్వం తీసుకొచ్చిన వెస్ట్ బెంగాల్ హౌసింగ్ ఇండస్ట్రీ రెగ్యులేషన్ యాక్ట్(హెచ్ఐఆర్ఏ) 2017.. కేంద్రానికి చెందిన రియల్ ఎస్టేట్(రెగ్యులేషన్ అండ్ డెవలప్మెంట్) యాక్ట్ ఇంచుమించు ఒకే విధంగా ఉన్నాయని జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస్ ఎమ్ ఆర్ షాతో కూడిన ధర్మాసనం పేర్కొంది. అందువల్ల బంగాల్ ప్రభుత్వం తీసుకొచ్చిన చట్టం ఆమోదయోగ్యం కాదని తెలిపింది.
అయితే ఈ తీర్పునకు ముందు ఆస్తులు కొన్న వారు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, వారి రిజిస్ట్రేషన్లు చెల్లుబాటు అవుతాయని సుప్రీం ధర్మాసనం స్పష్టం చేసింది.
హెచ్ఐఆర్ఏ చట్టబద్ధతను సవాలు చేస్తూ.. ఫారం ఫర్ పీపుల్స్ కలెక్టివ్ ఎఫర్ట్స్ అనే అసోసియేషన్ దాఖలు చేసిన పిటిషన్పై విచారించిన అనంతరం ఈ తీర్పును వెలువరించింది ధర్మాసనం.
ఇదీ చూడండి:- సంపూర్ణ లాక్డౌన్ను పరిశీలించండి: సుప్రీం