ETV Bharat / bharat

ట్రైలర్​లోని పాట.. సినిమాలో లేదెందుకు?: సుప్రీం కోర్టు - SHARUKH KHAN NEWS

సినిమా ప్రచారం అంశమై.. ప్రముఖ బాలీవుడ్​ నిర్మాణ సంస్థ యష్​రాజ్​ ఫిలిమ్స్​కు (Yashraj films news) చురకలు అంటించింది సుప్రీం కోర్టు. ట్రైలర్​లో చూయించిన పాట.. సినిమాలో ఎందుకు లేదని ప్రశ్నించింది.

Yash Raj Films
ఫ్యాన్​ , షారుక్​ ఖాన్​, సుప్రీం కోర్టు
author img

By

Published : Sep 21, 2021, 4:22 PM IST

ప్రముఖ నిర్మాణ సంస్థ యష్​రాజ్​ ఫిలిమ్స్​పై(Yashraj films news) సుప్రీం కోర్టు అసహనం వ్యక్తం చేసింది. బాలీవుడ్​ బాద్​షా షారుక్​ ఖాన్​ నటించిన 'ఫ్యాన్​' సినిమా (Shahrukh khan fan movie) ట్రైలర్​లో చూపించిన 'జబ్రా ఫ్యాన్​' అనే పాట.. సినిమాలో ఎందుకు లేదని ప్రశ్నించింది.

ఓ మహిళ ఫిర్యాదుతో.. నిర్మాణ సంస్థ రూ. 15 వేలు పరిహారం చెల్లించాలని జాతీయ వినియోగదారుల వివాదాల పరిష్కార కమిషన్(ఎన్​సీడీఆర్​సీ) ఆదేశించగా, దానిని సవాల్​ చేస్తూ సుప్రీంను ఆశ్రయించింది యష్​రాజ్​ ఫిలిమ్స్(Yashraj films news)​. దీనిపై విచారణ జరిపిన అత్యున్నత న్యాయస్థానం.. నిర్మాణ సంస్థకు చురకలు అంటించింది. సినిమాలో లేనప్పుడు.. అదే పాటతో ప్రచారం ఎలా నిర్వహిస్తారని నిలదీసింది.

''సమస్య ఏంటంటే.. మీరు (నిర్మాణ సంస్థ) సినిమాలో లేనిదేదో ట్రైలర్​లో చూపిస్తారు. ట్రైలర్​ విడుదల అయిందంటే.. అది సినిమా ట్రైలర్​ అనే అర్థం. ఇది.. సినిమా ప్రచారానికి ఉద్దేశించింది అని మీకు తెలిసినపుడు.. పాటతో మీరు సినిమాను ఎందుకు ప్రచారం చేయాలి?''

- సుప్రీం కోర్టు

అసలేం జరిగింది..?

మహారాష్ట్ర ఔరంగాబాద్​కు చెందిన అఫ్రీన్​ ఫాతిమా జైదీ అనే ఉపాధ్యాయురాలు.. 2016లో ఫ్యాన్​ సినిమా (Shahrukh khan fan movie) గురించి నిర్మాణ సంస్థపై (Yashraj films news) జిల్లా వినియోగదారుల పరిష్కార వేదికలో ఫిర్యాదు చేశారు. 'జబ్రా ఫ్యాన్'​ అనే పాట ట్రైలర్​లో చూసి, తన కుటుంబంతో కలిసి సినిమాకు వెళ్తే.. అది లేదని తెలుసుకొని మోసపోయామని చెప్పింది. అయితే.. అక్కడ ఆమెకు చుక్కెదురైంది. ఆమె ఫిర్యాదు తిరస్కరణకు గురైంది.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

ఆ తర్వాత.. ఆమె రాష్ట్ర ఫోరంను ఆశ్రయించగా, అఫ్రీన్​కు పరిహారంగా రూ. 10 వేలు, వ్యాజ్యం ఖర్చుల కింద రూ. 5 వేలు మొత్తంగా రూ. 15 వేలు చెల్లించాలని యష్​రాజ్​ ఫిలిమ్స్​ను ఆదేశించింది. దీనిపై జాతీయ వినియోగదారుల వివాదాల పరిష్కార కమిషన్​కు(ఎన్​సీడీఆర్​సీ) వెళ్లింది నిర్మాణ సంస్థ (Yashraj films). అక్కడా.. మహిళకు అనుకూలంగానే తీర్పు వచ్చింది. ఆ తర్వాత.. సుప్రీం కోర్టుకు వెళ్లారు నిర్మాతలు.

యష్​రాజ్​ ఫిలిమ్స్​ తరఫున వాదించిన నయోమి చంద్ర.. ''సినిమా ఇండస్ట్రీలో ఇలాంటివి సాధారణమేనని, ట్రైలర్​లో పాటలు.. సినిమాలో తప్పనిసరిగా ఉండాలనేం లేదు'' అని అన్నారు. పరిహారం చెల్లించాలన్న జాతీయ వినియోగదారుల కమిషన్​ నిర్ణయాన్ని నిలిపివేయాలని, లేదంటే సినిమా పరిశ్రమ తీవ్ర పరిణామాలను ఎదుర్కోవాల్సి ఉంటుందని కోర్టుకు చెప్పారు.

'సినిమా పరిశ్రమలో ఇలాంటివి సాధారణమే అయితే.. అది కచ్చితంగా కొనసాగించాలని అర్థం కాదు' అని వ్యాఖ్యానించింది జస్టిస్ హేమంత్​ గుప్తా, జస్టిస్ వి. రామసుబ్రమణియన్​తో కూడిన ద్విసభ్య ధర్మాసనం. ప్రస్తుతానికి.. ఎన్​సీడీఆర్​సీ తీర్పుపై స్టే విధిస్తూ, సరైన, ఆమోదయోగ్యమైన సమాధానంతో రావాలని​ నిర్మాణ సంస్థను ఆదేశించింది. ఉపాధ్యాయురాలికి కూడా నోటీసులు జారీ చేసింది.

ఇవీ చూడండి: sonu sood news: 'రాజ్యసభకు రెండు పార్టీల నుంచి ఆఫర్‌'

స్కూళ్లు తెరవాలని మైనర్ పిటిషన్- షాకిచ్చిన సుప్రీం

13 హైకోర్టులకు నూతన సీజేలు- సుప్రీం కొలీజియం సిఫార్సు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.