ETV Bharat / bharat

'కరోనా కారణంతో ముందస్తు బెయిల్ ఇవ్వొద్దు' - సుప్రీంకోర్టు న్యూస్ ఆన్​లైన్

కరోనా మహమ్మారిని కారణంగా చూపి ముందస్తు బెయిల్​ మంజూరు చేయవద్దని స్పష్టం చేసింది సుప్రీం కోర్టు. ఇటీవల ముందస్తు బెయిల్‌పై అలహాబాద్‌ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై స్టే విధించింది.

supreme court
సుప్రీంకోర్టు
author img

By

Published : May 25, 2021, 7:03 PM IST

అరెస్టు చేసి జైలుకు పంపిస్తే కొవిడ్‌తో చనిపోతారన్న భయాన్ని ఆధారంగా చేసుకుని ముందస్తు బెయిల్‌ మంజూరు చేయవద్దని సర్వోన్నత న్యాయస్థానం ఆదేశించింది. ఈ మేరకు ముందస్తు బెయిల్‌పై ఇటీవల అలహాబాద్‌ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై సుప్రీంకోర్టు స్టే విధించింది. ఓ కేసులో నిందితుడిగా ఉన్న ప్రతీక్‌ జైన్‌ అనే వ్యక్తి ముందస్తు బెయిల్‌ పిటిషన్‌పై విచారణ సందర్భంగా అలహాబాద్‌ హైకోర్టు ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.

అరెస్టుకు ముందు లేదా తర్వాత గానీ నిందితుడికి కరోనా సోకితే అది అతడి నుంచి పోలీసులు, కోర్టులు, జైలు సిబ్బందికి వ్యాపించే ప్రమాదం ఉందని తెలిపింది. వైరస్‌తో ప్రాణ భయం కూడా ఉన్నందున నిందితుడికి ముందస్తు బెయిల్‌ ఇచ్చేందుకు ఇది సరైన కారణమే అని హైకోర్టు తీర్పు వెలువరించింది. ఈ తీర్పును సవాల్‌ చేస్తూ ఉత్తర్‌ప్రదేశ్‌ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. మహమ్మారి ఇప్పుడప్పుడే పూర్తిగా తొలగిపోయే అవకాశం లేనందున ఈ కారణం చూపి నిందితుడికి బెయిల్‌ ఇవ్వడం సరికాదని ప్రభుత్వం అభిప్రాయపడింది. దీన్ని అవకాశంగా తీసుకుని నేరం చేసిన వ్యక్తులు స్వేచ్ఛగా బయట తిరుగుతారని పేర్కొంది.

ఈ పిటిషన్‌పై విచారణ జరిపిన సర్వోన్నత న్యాయస్థానం కొవిడ్‌ భయాన్ని కారణంగా చూపి నిందితులకు ముందస్తు బెయిల్‌ ఇవ్వలేమని పేర్కొంది. కేసు అర్హతలను బట్టి మాత్రమే బెయిల్‌పై నిర్ణయం తీసుకోవాలని సూచించింది.

ఇవీ చదవండి: 51 మొక్కలే వరకట్నం- ఎందరికో ఆదర్శం!

తెల్లవారితే పెళ్లి- ప్రేయసితో వరుడు పరార్

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.