ETV Bharat / bharat

రిజర్వేషన్ల తీర్పు పరిశీలనకు సుప్రీం ఓకే!

దేశంలో విద్య, ఉద్యోగాల్లో రిజర్వేషన్లు 50 శాతానికి మించరాదన్న తీర్పు పరిశీలనకు సుప్రీంకోర్టు అంగీకరించింది. మరాఠా రిజర్వేషన్ల కేసులో ఐదుగురు సభ్యుల ధర్మాసనం ఈ మేరకు తెలిపింది.

SC seeks states' response on quota to specific class
రిజర్వేషన్ల తీర్పు పరిశీలనకు సుప్రీంకోర్టు అంగీకారం
author img

By

Published : Mar 8, 2021, 3:02 PM IST

దేశవ్యాప్తంగా విద్య, ఉద్యోగాల్లో రిజర్వేషన్లు 50 శాతానికి మించరాదన్న తీర్పు పునః పరిశీలనకు సర్వోన్నత న్యాయస్థానం అంగీకరించింది. మహారాష్ట్రలో మరాఠాల రిజర్వేషన్లపై దాఖలైన పిటిషన్‌పై విచారణ చేపట్టిన ఐదుగురు సభ్యుల ధర్మాసనం ఈ మేరకు తెలిపింది.

రిజర్వేషన్లపై గతంలో ఇచ్చిన తీర్పును సమీక్షించాలో వద్దో నిర్ణయిస్తామని ధర్మాసనం పేర్కొంది. 50 శాతానికి మించి రిజర్వేషన్లపై అభిప్రాయాలు తెలపాలని అన్ని రాష్ట్రాలకు సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. మరాఠా రిజర్వేషన్ల కేసును ఈ నెల 15కు వాయిదా వేసింది.

ఇదీ చూడండి: ఆ రాష్ట్ర భాజపాలో అసమ్మతి.. అధిష్ఠానానికి నివేదిక

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.