ETV Bharat / bharat

రైతు సంఘాలతో సుప్రీం ప్యానెల్​ మరోసారి భేటీ - రైతు సంఘాలతో సుప్రీం కోర్టు కమిటీ భేటీ

సాగు చట్టాల పరిష్కారం దిశగా.. రైతు సంఘాలతో మరోసారి చర్చలు జరిపింది సుప్రీం ప్యానెల్​. 12 రైతు సంఘాలు ఇందులో పాల్గొని.. తమ విలువైన అభిప్రాయాలు, సలహాలు ఇచ్చాయని పేర్కొంది.

SC panel holds consultations with 12 farmer unions from 8 states
12 రైతు సంఘాలతో సుప్రీం ప్యానెల్​ మరోసారి చర్చ
author img

By

Published : Feb 12, 2021, 6:58 PM IST

సుప్రీంకోర్టు నియమించిన కమిటీ.. రైతులతో శుక్రవారం మరోసారి చర్చలు జరిపింది. బంగాల్​ సహా మొత్తం 8 రాష్ట్రాలకు చెందిన 12 రైతు సంఘాలు ఈ భేటీలో పాల్గొన్నాయి. కొత్త సాగు చట్టాల అమలు పరిష్కారం కోసం.. ముగ్గురు సభ్యులతో కూడిన ఈ కమిటీతో ఇప్పటివరకు ఏడుసార్లు భేటీ అయ్యాయి రైతు సంఘాలు.

వీడియో కాన్ఫరెన్స్​ ద్వారా జరిగిన ఈ సమావేశంలో రైతు సంఘాలు, వ్యవసాయ ఉత్పత్తి సంస్థలు(ఎఫ్​పీఓ) పాల్గొన్నాయనని ఓ ప్రకటనలో తెలిపింది సుప్రీం ప్యానెల్​. ఇందులో ఆంధ్రప్రదేశ్​, బిహార్​, జమ్ముకశ్మీర్​, మధ్యప్రదేశ్​, రాజస్థాన్​, తెలంగాణ, ఉత్తర్​ప్రదేశ్​, బంగాల్​కు చెందిన 12 రైతు సంఘాలు పాల్గొన్నట్టు పేర్కొంది. ఈ భేటీలో రైతులు తమ విలువైన అభిప్రాయాలు, సలహాలను ఇచ్చారని స్పష్టం చేసింది.

కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన వివాదాస్పద సాగు చట్టాల అమలును జనవరి 12న తాత్కాలికంగా(రెండు నెలల పాటు) నిలిపివేసింది సుప్రీం కోర్టు. ఈ నేపథ్యంలో కేంద్రం-రైతులు మధ్య సమస్యల పరిష్కారానికి సంబంధించిన నివేదిక సమర్పించాలని కమిటీని కోరింది.

కేంద్రం, అన్నదాతల మధ్య ఏర్పడిన ప్రతిష్టంభన నేపథ్యంలో.. 41 రైతు సంఘాలతో ఇప్పటివరకు 11 దఫాలుగా చర్చలు జరిపింది కేంద్రం. అయితే.. ఈ చట్టాలను పూర్తిగా రద్దు చేయాల్సిందేనని రైతు సంఘాలు డిమాండ్​ చేస్తున్నందున ఇప్పటివరకు ఎలాంటి పురోగతి లేదు.

ఇదీ చదవండి: ఆత్మనిర్భర్​ భారత్​ లక్ష్యంగానే బడ్జెట్​: నిర్మల

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.