ETV Bharat / bharat

'సుప్రీంకోర్టులో త్వరలోనే భౌతిక విచారణ' - సుప్రీంకోర్టులో టారిఫ్​ కేసు

మరో 10 రోజుల్లో సుప్రీంకోర్టులో భౌతిక విచారణ మొదలయ్యే అవకాశం ఉందని భారత ప్రధాన న్యాయమూర్తి(సీజేఐ) జస్టిస్ ఎన్.వి.రమణ నేతృత్వంలోని ధర్మాసనం తెలిపింది. వర్చువల్ పద్ధతిలో విచారణల వల్ల కొన్నిసార్లు న్యాయవాదులను చూడలేకపోతున్నామని, వారి వాదనలు సరిగా వినిపించడం లేదని చెప్పింది.

supreme court
సుప్రీంకోర్టు
author img

By

Published : Aug 19, 2021, 4:51 AM IST

Updated : Aug 19, 2021, 6:35 AM IST

కరోనా కారణంగా గత ఏడాది మార్చి నుంచి సుప్రీంకోర్టులో వర్చువల్​గా జరుగుతున్న విచారణల స్థానంలో భౌతిక విచారణ మొదలుకానుంది. మరో 10 రోజుల్లో ఇది ప్రారంభమయ్యే అవకాశం ఉందని భారత ప్రధాన న్యాయమూర్తి(సీజేఐ) జస్టిస్ ఎన్.వి.రమణ నేతృత్వంలోని ధర్మాసనం బుధవారం తెలిపింది. భారత టెలికాం నియంత్రణ ప్రాధికార సంస్థ (ట్రాయ్) ప్రకటించిన టారిఫ్ ఉత్తర్వులపై బాంబే హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్​ను జస్టిస్ ఎన్​.వి.రమణ, జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ అనిరుద్ధ బోస్​ల ధర్మాసనం విచారించింది. ఈ సందర్భంగా భౌతిక విచారణల గురించి ప్రస్తావించింది.

వర్చువల్ పద్ధతిలో విచారణల వల్ల కొన్నిసార్లు న్యాయవాదులను చూడలేకపోతున్నామని, వారి వాదనలు సరిగా వినిపించడం లేదని ధర్మాసనం తెలిపింది. మరో వారం పది రోజుల్లో భౌతిక విచారణను ప్రారంభిస్తామని జస్టిస్ ఎన్​.వి.రమణ చెప్పారు.

సమాధానం ఇవ్వండి..

ఈ వ్యాజ్యాలపై సమాధానం ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వం, ట్రాయ్​లను ధర్మాసనం ఆదేశించింది. గత ఏడాది విడుదల చేసిన టారిఫ్ రేట్లను బాంబే హైకోర్టు ఆమోదించింది. అయితే ఏదైనా ఒక ఛానెల్ టారిఫ్ ధర ఆ ప్యాకేజీలో అత్యంత ఎక్కువగా వసూలు చేసే ధరలో మూడోవంతుకు మించి ఉండకూడదంటున్న నిబంధనను మాత్రం తిరస్కరించింది. ఈ ఛార్జీలు తమకు ఆమోదయోగ్యం కాదంటూ పలు సంస్థలు వ్యాజ్యాలు వేశాయి. సెప్టెంబరు ఏడో తేదీలోగా సమాధానాలు చెప్పాలని ఆదేశిస్తూ తదుపరి విచారణను వాయిదా వేసింది.

ఇదీ చూడండి: 'సుప్రీం' జడ్జిలుగా తొమ్మిది మంది న్యాయమూర్తుల పేర్లు సిఫారసు

ఇదీ చూడండి: తొలి మహిళా సీజేఐగా ఆ న్యాయమూర్తికే అవకాశం?

Last Updated : Aug 19, 2021, 6:35 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.