ETV Bharat / bharat

సెక్స్ వర్కర్లకు ఆధార్ కార్డులు.. సుప్రీం కీలక ఆదేశం

SC Sex workers: సెక్స్ వర్కర్లకు ఆధార్ కార్డులు జారీ చేయాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. వారి గోప్యతను కాపాడుతూనే వీటిని జారీ చేసేలా చూడాలని ఆదేశాలు ఇచ్చింది.

SC SEX WORKERS
SC SEX WORKERS
author img

By

Published : May 20, 2022, 5:15 AM IST

Aadhaar cards sex workers: దేశంలోని ప్రతి వ్యక్తికి గౌరవం పొందాల్సిన ప్రాథమిక హక్కు ఉందని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. కరోనా సమయంలో సెక్స్ వర్కర్లు ఎదుర్కొన్న సమస్యలపై విచారణ జరిపిన సుప్రీంకోర్టు... వారికి ఆధార్ కార్డులు జారీ చేయాలని ఆదేశించింది. యూఐడీఏఐ జారీ చేసే ప్రొఫార్మా సర్టిఫికేట్ ఆధారంగా.. ఆధార్ కార్డులు ఇవ్వాలని సూచించింది. సెక్స్ వర్కర్ల గుర్తింపును బహిర్గతం చేయకూడదని, వారి గోప్యతను కాపాడాలని జస్టిస్ లావు నాగేశ్వర రావు నేతృత్వంలోని ధర్మాసనం స్పష్టం చేసింది.

sex workers in lockdown: ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వాలు సెక్స్ వర్కర్ల జాబితాను రూపొందించాలని సుప్రీం ఆదేశించింది. రేషన్ అందనివారిని సైతం గుర్తించాలని స్పష్టం చేసింది. సీబీఓ(కమ్యునిటీ బేస్డ్ ఆర్గనైజేషన్) గుర్తించిన సెక్స్ వర్కర్లకు ఓటర్ ఐడీలు సైతం ఇచ్చేలా చర్యలు తీసుకోవాలని పేర్కొంది. సెక్స్ వర్కర్లకు రేషన్ అందించాలని ఇదివరకే సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. వారికి ఎటువంటి గుర్తింపు కార్డులు లేదన్న కారణంతో.. రేషన్ పంపిణీని అడ్డుకోవద్దని సూచించింది.

ఇదీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.