ETV Bharat / bharat

'కొవిడ్ మృతుల పరిహారంపై ఆరు వారాల్లో తేల్చండి' - కరోనా మృతుల పరిహారంపై సుప్రీంకోర్టు ఆదేశాలు

కరోనా మృతుల కుటుంబాలకు పరిహారం చెల్లింపుపై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. పరిహారానికి సంబంధించి మార్గదర్శకాలు రూపొందించాలని ఆదేశాల్లో పేర్కొంది.

sc
సుప్రీంకోర్టు
author img

By

Published : Jun 30, 2021, 11:10 AM IST

Updated : Jun 30, 2021, 11:50 AM IST

కొవిడ్ మృతుల కుటుంబాలకు రూ.4 లక్షల చొప్పున పరిహారం అందించాలన్న పిటిషన్​పై సర్వోన్నత న్యాయస్థానం కీలక ఆదేశాలు జారీ చేసింది. పరిహారానికి సంబంధించి ఎంత మొత్తం చెల్లించగలరో మార్గదర్శకాలు రూపొందించాలని అందులో పేర్కోంది. జస్టిస్ అశోక్ భూషన్ నేతృత్వంలోని ముగ్గురు న్యాయమూర్తుల ధర్మాసనం ఈ ఆదేశాలు జారీ చేసింది.

కరోనా బలితీసుకున్న కుటుంబాలకు.. కనీసం ఉపశమనం కలిగించేందుకు ఎంతమొత్తం పరిహారం అందించాలో ఆరు వారాల్లో నిర్ణయించాలని.. జాతీయ విపత్తు నిర్వహణ అథారిటీకి సూచించింది. నష్టం పరిహారం ఖరారు చేసేటపుడు అన్ని కోణాలను దృష్టిలో పెట్టుకోవాలని స్పష్టంచేసింది. జస్టిస్‌ అశోక్‌ భూషణ్‌ నేతృత్వంలోని ముగ్గురు సభ్యుల సుప్రీంకోర్టు ధర్మాసనం ఈ మేరకు ఆదేశాలిచ్చింది.

బీమా పథకం..

ఫైనాన్స్ కమిషన్ ప్రతిపాదనల మేరకు విపత్తు కారణంగా మరణించే వారి కుటుంబ సభ్యుల కోసం బీమా పథకాన్ని రూపొందించాలని సుప్రీంకోర్టు కేంద్రానికి సూచించింది. అలాగే.. కరోనా కారణంగా మరణించిన వారిపై ఆధారపడిన కుటుంబసభ్యులకు ధృవీకరణ పత్రాలను మంజూరు చేసే ప్రక్రియను సరళతరం చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించింది.

'అలా చేస్తే నిధుల మిగలవు..'

ఈ కేసు విచారణ సందర్భంగా ప్రకృతి వైపరీత్య నిర్వహణ చట్టం కింద..కొవిడ్‌ మృతుల కుటుంబాలకు రూ.4 లక్షల పరిహారం చెల్లించడం సాధ్యం కాదని.. ఇటీవల కేంద్ర హోంశాఖ సుప్రీంకోర్టుకు తెలిపింది. ఈ మేరకు 183 పేజీల ప్రమాణ పత్రాన్ని సమర్పించింది. కొవిడ్‌ మృతుల కుటుంబాలన్నింటికీ పరిహారం చెల్లించాలంటే రాష్ట్రాల ప్రకృతి వైపరీత్య నిధులు పూర్తిగా వాటికే కేటాయించాల్సి వస్తుందని.. అలా చేస్తే మహమ్మారి నియంత్రణకు నిధులేమీ మిగలవని న్యాయస్థానానికి కేంద్రం తెలిపింది.

జాతీయ ప్రకృతి వైపరీత్య చట్టం కింద 2015 ఏప్రిల్‌ 8న కేంద్ర హోం శాఖ జారీచేసిన ఉత్తర్వుల మేరకు కొవిడ్‌ మృతుల కుటుంబాలకు 4 లక్షల పరిహారం చెల్లించేలా ఆదేశించాలని గౌరవ్‌కుమార్‌ బన్సల్‌ కోర్టులో పిటిషన్‌ వేశారు. ఆ పిటిషన్‌పై వాదనలు విన్న న్యాయస్థానం ఈ మేరకు ఆదేశాలు జారీచేసింది.

ఇవీ చదవండి:

Last Updated : Jun 30, 2021, 11:50 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.