భారతీయ స్టేట్ బ్యాంకులో పనిచేయాలనుకునే వారికి శుభవార్త. 6,100 అప్రెంటిస్ పోస్టులను(bank jobs India) ఎస్బీఐ నోటిఫికేషన్ విడుదల చేసింది. జులై 26 వరకు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంది.
రాష్ట్రాలవారీగా ఈ నియామక ప్రక్రియ జరగనుంది. అయితే అప్లికేషన్ సమయంలో ఒకే రాష్ట్రాన్ని ఎంచుకునే వీలుంటుంది. రిజిస్ట్రేషన్ సందర్భంగా మూడు జిల్లాలను(bank jobs in Hyderabad) ఎంపిక చేసుకునే అవకాశం ఉంటుంది.
అప్లై చేసుకోవడం ఎలాగంటే...
- ఎస్బీఐ అధికారిక వెబ్సైట్ sbi.co.inలోకి వెళ్లాలి.
- హోమ్ పేజీలో కిందకు స్క్రోల్ చేసి... కెరీర్స్ ఆప్షన్‌పై క్లిక్ చేయాలి
- కొత్త పేజీలో తాజా ప్రకటనల విభాగం ఉంటుంది. అందులో Engagement of Apprentices Under The Apprentices Act, 1961 అనే ప్రకటన పక్కన ఉండే అప్లై ఆన్లైన్ బటన్‌ను క్లిక్ చేయాలి.
- మరో పేజీ ఓపెన్ అయిన తర్వాత 'నూతన రిజిస్ట్రేషన్' ఆప్షన్‌ను ఎంచుకోవాలి.
- అందులో వ్యక్తిగత, విద్యా సంబంధిత వివరాలన్నీ నమోదు చేయాలి. అనంతరం సబ్మిట్ బటన్‌పై క్లిక్ చేయాలి.
- అప్రెంటిస్‌షిప్ దరఖాస్తును ప్రింట్ తీసుకోవాలి.
జులై 26 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. జులై 6 నుంచి 26 మధ్య పరీక్షా రుసుం చెల్లించే వీలుంది. అప్లికేషన్లను డౌన్లోడ్ చేసుకోవడానికి ఆగస్టు 10 వరకు అవకాశం ఉంటుంది.
ఫీజు ఎంత?
జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ కేటగిరీ అభ్యర్థులకు రూ.300. ఎస్సీ, ఎస్టీ కేటగిరీ అభ్యర్థులు పరీక్షా రుసుం చెల్లించాల్సిన అవసరం లేదు.
అప్రెంటిస్‌షిప్‌కు ఎంపికైతే నెలకు రూ.15 వేల చొప్పున స్టైపెండ్ అందుతుంది. ఈ అప్రెంటిస్‌షిప్ కాలపరిమితి ఒక ఏడాది.
ఇదీ చదవండి: Viral Video: ఘనంగా గజ'రాజు' బర్త్‌డే వేడుక