ETV Bharat / bharat

జైన్ నాలుగో జైలు వీడియో లీక్.. ఆ అధికారులతో ముచ్చట్లు.. స్పెషల్​గా రూమ్ క్లీనింగ్! - విడుదలైన సత్యేందర్ జైన్‌ మరో వీడియో

తిహాడ్‌ జైలులో ఉన్న దిల్లీ మంత్రి సత్యేందర్ జైన్‌కు సంబంధించి మరో వీడియో విడుదలైంది. ఆయన గదిని కొందరు శుభ్రం చేసినట్లు ఆ వీడియోలో ఉంది. మరి కొంత మంది జైన్‌తో మాట్లాడుతున్నట్లు వీడియోలో కనిపిస్తోంది.

Etv Bharat
Etv Bharat
author img

By

Published : Nov 27, 2022, 11:58 AM IST

విడుదలైన సత్యేందర్ జైన్‌ మరో వీడియో

మనీలాండరింగ్ కేసులో అరెస్టై తిహాడ్‌ జైలులో ఉన్న దిల్లీ మంత్రి సత్యేందర్ జైన్‌కు సంబంధించిన నాలుగో వీడియో బయటకొచ్చింది. జైలులో ఆయన గదిని కొందరు శుభ్రం చేసినట్లు ఆ వీడియోలో ఉంది. అక్టోబరు 1న ఆ వీడియో రికార్డైనట్లు సీసీటీవీ దృశ్యాల్లో నమోదైంది. సెప్టెంబరు 12న ఆయన కొందరితో మాట్లాడిన వీడియో సైతం విడుదలైంది.

టీషర్ట్, నిక్కర్‌, నైట్ ప్యాంట్ వేసుకున్న కొందరు వ్యక్తులు మంచంపై పడుకున్న జైన్‌తో మాట్లాడారు. ఆ తర్వాత సస్పెండ్ అయిన తిహాడ్ జైలు సూపరింటెండెంట్ అజిత్ కుమార్ రాగా మిగిలినవారంతా బయటకు వెళ్లిపోయారు. తర్వాత జైన్, అజిత్ కుమార్ చాలాసేపు మాట్లాడుకున్నారు. జైలులో సత్యేంద్ర జైన్‌కు వీఐపీ ట్రీట్​మెంట్ అందిస్తున్నారనే ఆరోపణలతో జైలు సూపరింటెండెంట్ అజిత్ కుమార్‌ను ఇటీవలే సస్పెండ్ చేశారు.

అయితే జైలులో ఖైదీలందరూ సమానమేనని సత్యేంద్ర జైన్‌కు ఎలాంటి ప్రత్యేక సదుపాయాలు కల్పించవద్దని దిల్లీ కోర్టు న్యాయమూర్తి శనివారం ఆదేశించారు. జైలులో ఖైదీలకు కుల, మత, లింగ, హోదాపరమైన వివక్షకు తావులేకుండా ఒకే ఆహారం అందించాల్సిందేనని న్యాయమూర్తి చెప్పారు. తన మత విశ్వాసాల ప్రకారం ఆహారం అందించడం ఆపేశారని సత్యేంద్ర జైన్‌ వేసిన పిటిషన్‌ను శనివారం దిల్లీ కోర్టు కొట్టివేసింది. ప్రత్యేక ఆహారం కావాలంటే జైలు అధికారులకు అర్జీ పెట్టుకోవాలన్న న్యాయమూర్తి... వారు పరిశీలించి నిర్ణయం తీసుకుంటారని స్పష్టంచేసింది.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.