ETV Bharat / bharat

వారిని టార్గెట్ చేస్తూ దర్యాప్తు సంస్థల దుర్వినియోగం, కేంద్రంపై గవర్నర్​ ఫైర్ - సత్యపాల్​ మాలిక్​ న్యూస్

కేంద్ర ప్రభుత్వ తీరుపై నిప్పులు చెరిగారు మేఘాలయ గవర్నర్​ సత్యపాల్​ మాలిక్. దర్యాప్తు సంస్థలను కేంద్రం దుర్వినియోగం చేస్తోందని, కొందరు వ్యక్తులను లక్ష్యంగా చేసుకుని దాడులకు పాల్పడుతోందని ఆరోపించారు. కనీస మద్దతు ధరకు చట్టబద్ధత కల్పించకపోతే రైతులు మళ్లీ ఆందోళన బాట పడతారని హెచ్చరించారు.

satyapal malik on modi
satyapal malik on modi
author img

By

Published : Aug 22, 2022, 11:12 AM IST

Satyapal malik on central government: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రభుత్వాన్ని తీవ్రంగా విమర్శించారు మేఘాలయ గవర్నర్​ సత్యపాల్ మాలిక్. కేంద్రం.. దర్యాప్తు సంస్థలను దుర్వినియోగం చేస్తోందని, కొందరు వ్యక్తులను లక్ష్యంగా చేసుకుని దాడులకు పాల్పడుతోందని ఆరోపించారు. ఆదివారం హరియాణా నూహ్​లో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న గవర్నర్​ ఈ వ్యాఖ్యలు చేశారు. దిల్లీ ఎక్సైజ్​ పాలసీ కేసులో ఉపముఖ్యమంత్రి మనీశ్​ సిసోదియాపై దాడి చేసిన సమయంలోనే ఈ వ్యాఖ్యలు చేయడం చర్చనీయాంశంగా మారింది.

"కేంద్రం మూడు దర్యాప్తు సంస్థలను దుర్వినియోగం చేస్తోంది. కొందరిని లక్ష్యంగా చేసుకుని దాడులు చేస్తోంది. భాజపాలో విచారించాల్సిన వ్యక్తులు లేరా? నేను పది మంది పేర్లను ఇస్తాను. వారందరిపైనా విచారణ చేయండి. అవసరమైతే నాపైన కూడా విచారణ జరిపించండి."

-సత్యపాల్​ మాలిక్​, మేఘాలయ గవర్నర్​

కనీస మద్దతు ధర, రైతుల పోరాటంపైనా గవర్నర్ సత్యపాల్​​ మాలిక్ స్పందించారు. కనీస మద్దతు ధరకు చట్టబద్ధత కల్పించకపోతే రైతులు మళ్లీ ఆందోళన బాట పడతారని హెచ్చరించారు. రైతులను మనం భయపెట్టలేమని, కనీస మద్దతు ధరకు చట్టబద్ధతను ఎలాగైనా సాధిస్తారని మాలిక్​ ఆశాభావం వ్యక్తం చేశారు. మొదట్లో రైతు ఆందోళనలను ప్రధాని మోదీ తేలికగా తీసుకున్నారని చెప్పారు. మీరు వెనక్కి తగ్గినప్పుడే రైతులు వెళ్లిపోతారని ఆయనకు(మోదీకి) చెప్పానని మాలిక్​ తెలిపారు. చివరకు ఆయన వ్యవసాయ చట్టాలను ఉపసంహరించుకుని క్షమాపణలు చెప్పారని పేర్కొన్నారు. కానీ అప్పటికే చాలా ఆలస్యమైందని.. జరగాల్సిన విధ్వంసం జరిగిపోయిందన్నారు మాలిక్.

ఇవీ చదవండి: భారీగా తగ్గిన కరోనా వ్యాప్తి, 10 వేల దిగువకు కేసులు

హ్యాట్రిక్​ కోసం భాజపా పక్కా గేమ్ ప్లాన్, అందుకే ఆయనకు నో, ఈయనకు ఎస్​

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.