ETV Bharat / bharat

శశికళకు అడుగడుగునా అభిమానుల ఘనస్వాగతం - తమిళనాడు రాజకీయాలు

దివంగత నేత జయలలిత నెచ్చెలి శశికళ బెంగళూరు నుంచి 23 గంటల సుదీర్ఘ ప్రయాణం తర్వాత చెన్నైలోని ఆమె నివాసానికి చేరుకున్నారు. మాజీ ముఖ్యమంత్రి ఎంజీఆర్​ నివాసాన్ని సందర్శించి నివాళులు అర్పించారు.

jayalalitha, sasikala
23 గంటల ప్రయాణం తర్వత చెన్నైకు చేరిన శశికళ
author img

By

Published : Feb 9, 2021, 1:17 PM IST

తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత నెచ్చెలి వీకే శశికళ చెన్నై చేరుకున్నారు. బెంగళూరు నుంచి 23 గంటల సుదీర్ఘ రోడ్డు ప్రయాణం తర్వాత మంగళవారం ఉదయం టీ నగర్​లోని ఆమె నివాసానికి వచ్చారు. సోమవారం ఉదయం బెంగళూరులో ప్రయాణం ప్రారంభించిన శశికళకు ఆమె మద్దతుదార్లు దారిపొడవునా ఘన స్వాగతం పలికారు.

చెన్నై చేరిన శశికళ

ఎంజీఆర్​​ నివాసానికి..

ఆమె నివాసానికి చేరుకునే ముందు శశికళ రామాపురంలోని మాజీ ముఖ్యమంత్రి ఎంజీ రామచంద్రన్​ నివాసాన్ని సందర్శించారు. ఎంజీఆర్ చిత్రపటానికి నివాళులు అర్పించారు. అమ్మ మక్కల్​ మున్నేట్ర కజగం నేత, శశికళ మేనల్లుడు టీటీవీ దినకరన్​ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అక్రమాస్తుల కేసులో జైలు శిక్ష అనుభవించిన శశికళ.. ఈ ఏడాది జనవరి 27న విడుదలయ్యారు.

ఇదీ చదవండి : 'చిన్నమ్మ వస్తే తమిళనాడులో అల్లర్లే'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.